లాక్డౌన్తో ఇన్నాళ్లు ఇంటికే పరిమితమైన నటి జెనీలియా... ప్రభుత్వం సడలింపులు ఇచ్చిన నేపథ్యంలో కుటుంబంతో సరదాగా సమయాన్ని ఆస్వాదిస్తోంది. లాతూర్ నగరంలోని తమ పొలంలో చెట్టు కింద తన పిల్లలను చదివిస్తూ కనిపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను ఇన్స్టాలో పంచుకుంది.
"ప్రకృతి ఒడిలో నా పిల్లల్ని చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉంది. కానీ తల్లిదండ్రులుగా మేమిద్దరం ప్రకృతి ప్రపంచానికి దూరంగా నగర వాతవారణంలో పెరిగాం. ఇంతకాలం ఈ ఆనందాన్ని కోల్పోవడం ఎంతో బాధగా ఉంది. కనీసం నా పిల్లల్ని.. ప్రకృతి, జంతు ప్రేమికులుగా పెంచాలని నిశ్చయించుకున్నా. అందుకే వీరిని ఈ చెట్టుకింద చదివిస్తున్నా. ఇలా వీరిని చూస్తుంటే ఓ తల్లిగా ఎంతో ముచ్చటగా ఉంది. మా పిల్లలకు మేం అందించే పెద్ద బహుమతి ఇదే. మనం ఎలాగో వీటిని కోల్పోయాం.. కనీసం మన తర్వాత తరానికైనా అందిద్దాం"
-జెనీలియా, సినీ నటి
తమ పిల్లలతో కలిసి ఇలా గడపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు జెనీలియా-రితేష్. ప్రతిఒక్కరూ తమ పిల్లల కోసం సమయం కేటాయించాలని సూచించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ఇది చూడండి : సుశాంత్ పెంపుడు శునకానికి ఏమైంది?