బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అతడి తల్లి నీతూ కపూర్‌కు కరోనా పాజిటివ్ అని నెట్టింట్లో వార్తలు జోరందకున్నాయి. అయితే తాజాగా దీనిపై నటుడి సోదరి రిద్ధిమా కపూర్ సన్హి స్పందించారు. ఈ వార్తలు అవాస్తమని కొట్టిపారేశారు. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయొద్దని కోరారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాలో వెల్లడించారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
"దయచేసి ఓ వార్తను ప్రచారం చేసేటప్పుడు అందులోని నిజాన్ని ధృవీకరించిన తర్వాతే పోస్ట్ చేయండి... మేమంతా బాగున్నాం! ధన్యవాదాలు!"
-రిద్ధిమా కపూర్, రణ్‌బీర్ సోదరి
బాలీవుడ్ సీనియర్ నటి హేమామాలిని కూడా అనారోగ్యంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు పుకార్లు వచ్చాయి. అయితే ఈ వార్తలు కూడా నిరాధారమైనవని స్పష్టం చేశారు ఆమె కుమార్తె ఇషా దేఓల్.
-
My mother @dreamgirlhema is fit & fine 🧿 ! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern . ♥️🙏🏼
— Esha Deol (@Esha_Deol) July 12, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">My mother @dreamgirlhema is fit & fine 🧿 ! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern . ♥️🙏🏼
— Esha Deol (@Esha_Deol) July 12, 2020My mother @dreamgirlhema is fit & fine 🧿 ! The news regarding her health is absolutely fake so please don’t react to such rumours! Thanks to everyone for their love & concern . ♥️🙏🏼
— Esha Deol (@Esha_Deol) July 12, 2020
శనివారం.. అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. స్వయంగా వారే సామాజిక మాధ్యమాల వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం స్థిమితంగానే ఉంది. ఈ నేపథ్యంలో రణ్‌బీర్, నీతూ కపూర్, హేమామాలిని ఆరోగ్యంపై నెట్టింట్లో ఈ పుకార్లు వైరల్ అయ్యాయి.
రిపోర్ట్స్ రావాలి
బచ్చన్ కుటుంబంలో కరోనా కలకలం రేపడం వల్ల బిగ్‌బీ సతీమణి జయ, హీరోయిన్ ఐశ్వర్యారాయ్ సహా మిగితా కుటుంబసభ్యులకు వైరస్ నిర్థరణ పరీక్షలు చేసి క్వారంటైన్లో ఉంచారు. ఫలితాలు రావడానికి ఇంకాస్త సమయం పడుతుందని వైద్యులు తెలిపారు.
ఇది చూడండి : 'మీరు త్వరగా కోలుకోవాలి అమితాబ్'
బిగ్ బీ, అభిషేక్‌కు కరోనా- ఆసుపత్రికి తరలింపు