బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధం ఉన్న వారిపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు అధికారులు. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని కూడా విచారిస్తున్నారు. అందుకోసం మూడు రోజులుగా సీబీఐ ముందు హాజరవుతోన్న రియా తాజాగా నాలుగో రోజూ విచారణకు వచ్చింది.
రియాతో పాటు ఆమె సోదరుడు షౌహిక్ చక్రవర్తి కూడా ఐదు రోజులుగా విచారణకు హాజరవుతున్నాడు. సుశాంత్ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, రియా-సుశాంత్ మధ్య ప్రేమ, సుశాంత్ కుటుంబంతో రియాకు ఉన్న సాన్నిహిత్యంతో సహా పలు అంశాలపై సీబీఐ విచారణ కొనసాగుతోంది.
అలాగ్ సుశాంత్ వంట మనిషి నీరజ్ కూడా సీబీఐ విచారణ కోసం డీఆర్డీఓ గెస్ట్ హౌజ్‌కు చేరుకున్నాడు.
ఇప్పటికో మూడు రోజులుగా రియా సీబీఐ విచారణకు హాజరవుతోంది. ఆదివారం నాడు ఈ నటిని తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది సీబీఐ.