ETV Bharat / sitara

సుశాంత్ కేసులో రియాకు సీబీఐ సమన్లు? - సుశాంత్ సీబీఐ కేసు

సుశాంత్ కేసు విచారణలో భాగంగా నటి రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు జారీ చేసిందని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై ఆమె లాయర్ స్పందించారు.

సుశాంత్ కేసులో రియాకు సీబీఐ సమన్లు?
నటి రియా చక్రవర్తి
author img

By

Published : Aug 24, 2020, 5:28 PM IST

బాలీవుడ్​ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఇటీవలే తీర్పిచ్చింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటి రియా చక్రవర్తికి కేంద్ర దర్యాప్తు బృందం సమన్లు జారీ చేసిందని పలు వార్తలు వచ్చాయి. వీటిని తోసిపుచ్చిన ఆమె లాయర్.. ఇప్పటివరకు ఎలాంటి సమన్లు రియా అందుకోలేదని చెప్పారు.

"డియర్ ఫ్రెండ్స్, రియా చక్రవర్తి, ఆమె కుటుంబానికి సీబీఐ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. అంతకు ముందు వారు ముంబయి పోలీసులు, ఈడీ విచారణలో మాత్రమే పాల్గొన్నారు. ఈ విషయంలో పుకార్లు సృష్టించొద్దు"

-సతీశ్ మనిషిండే, రియా చక్రవర్తి లాయర్

  • Rhea Chakraborty and her family have not received any summons from the Central Bureau of Investigation, so far. If they receive a summon, they will appear before the agency: Satish Maneshinde, lawyer of actor Rhea Chakraborty#SushantSinghRajput

    — ANI (@ANI) August 24, 2020
" class="align-text-top noRightClick twitterSection" data=" ">

జూన్ 14న తన సొంత ఫ్లాట్​లో ఆత్మహత్య చేసుకుని మరణించాడు సుశాంత్. తొలుత నెపోటిజమ్​ కారణమని విమర్శలు వచ్చినా, అనంతరం రియానే అతడి మృతికి కారణమంటూ సుశాంత్ తండ్రి పట్నాలో కేసు పెట్టారు. తర్వాత బిహార్ ప్రభుత్వం ఈ కేసును సీబీఐకి సిఫార్స్ చేయడం, కొన్నిరోజులకు వారికి దీనిని అప్పగిస్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది.

ఈ క్రమంలోనే ముంబయి చేరుకున్న సీబీఐ బృందం.. సుశాంత్ వ్యక్తిగత సిబ్బందిని విచారించింది. గతంలో సుశాంత్ రెండు నెలల పాటు ఉన్న వాటర్​స్టోన్ రిసార్ట్​కు వెళ్లి, అక్కడ ఉన్న సమయంలో అతడు ఎలా ప్రవర్తించేవాడో అడిగి తెలుసుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.