ETV Bharat / sitara

కీలక మలుపులతో ఉత్కంఠగా సుశాంత్​ కేసు! - rhea chakravarti latest news

సుశాంత్​ రాజ్​పుత్​ ఆత్మహత్య కేసులో డ్రగ్స్​ వ్యాపారులతో సంబంధం ఉందన్న కారణంతో రియా చక్రవర్తిని ఎన్​సీబీ అరెస్టు చేసింది. అయితే ఇప్పటికే సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొన్న రియా.. ఎన్​సీబీ విచారణకూ హాజరైంది.

sushant
సుశాంత్​
author img

By

Published : Sep 8, 2020, 6:13 PM IST

Updated : Sep 8, 2020, 9:28 PM IST

సుశాంత్​ సింగ్​ రాజ్​పుత్​ మృతి కేసుకు సంబంధించి ఎన్​సీబీ చేపట్టిన దర్యాప్తులో కీలక మలుపు చోటుచేసుకుంది. డ్రగ్​ కోణంలో మూడు రోజుల విచారణ అనంతరం.. బాలీవుడ్​ నటి రియా చక్రవర్తిని మంగళవారం ఎన్​సీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆమెపై ఎన్​డీపీఎస్​ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద అభియోగాలు మోపారు. మరికొద్ది సేపట్లో వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మెజిస్ట్రేట్​ ఎదుట హాజరు పర్చనున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే సుశాంత్​ కేసు విచారణ నిమిత్తం సీబీఐ, ఈడీ అధికారులు రియాను అనేక కోణాల్లో ప్రశ్నించారు.

సీబీఐ విచారణ

బిహార్​ పట్నాలో సుశాంత్​ తండ్రి నమోదు చేసిన ఫిర్యాదు మేరకు సుప్రీం కోర్టు కేసును సీబీఐకి అప్పగించింది. అప్పటి నుంచి దర్యాప్తులో భాగంగా రియాను పలు కోణాల్లో ప్రశ్నిస్తూ వస్తోంది సీబీఐ. సుశాంత్​ ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, రియా-సుశాంత్ మధ్య ప్రేమ, సుశాంత్ కుటుంబంతో రియాకు ఉన్న సాన్నిహిత్యంతో సహా పలు అంశాలపై సీబీఐ విచారించింది. వీటితో పాటు జూన్​ 8న సుశాంత్​ ఫ్లాట్​ నుంచి తను వెళ్లిపోవడం, అతనికి అందించిన వైద్య చికిత్స, మందులతో సహా పలు అంశాలపై సీబీఐ రియాను ప్రశ్నించింది. రియాతో సహా ఆమె కుటుంబ సభ్యులు, కేసుతో సంబంధమున్న అనేక మందిని విచారించింది.

ఈడీ దర్యాప్తు

Rhea Chakraborty
రియా చక్రవర్తి

మనీల్యాండరింగ్​ కేసుకు సంబంధించి ఈడీ కూడా దర్యాప్తు ప్రారంభించింది. రియాతో పాటు, ఆమె కుటుంబ సభ్యులు, చార్టర్డ్​ అకౌంటెంట్​ రితేశ్​ షా, మాజీ మేనేజర్​ శ్రుతి మోదీలనూ ఆర్థిక లావాదేవీల గురించి విచారించారు.

రియాతో సహా పలువురు అరెస్టు

సుశాంత్​ మరణానికి సంబంధించి మాదకద్రవ్యాల కేసులో ఎన్​సీబీ విచారణ చేపట్టి.. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్​, సహచరుడు శామ్యూల్​ మిరండాలను అదుపులోకి తీసుకుంది. వీరితో పాటు మాదక ద్రవ్య వ్యాపారులు అబ్దుల్ బాసిత్​ పరిహార్​, జైద్​ విలత్రాలనూ.. ఎన్​సీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. కాగా సెప్టెంబరు 6న రియా తొలిసారి ఎన్​సీబీ ఎదుట హాజరైంది. వరుసగా మూడురోజుల పాటు విచారించిన అధికారులు.. మంగళవారం ఆమెను అరెస్టు చేశారు.

ప్రముఖుల్లో గుబులు

ఈ కేసులో నిందితులు ఇచ్చిన పేర్ల ఆధారంగా ఇప్పటికే 25 మంది బాలీవుడ్‌ సెలబ్రిటీల జాబితాను అధికారులు తయారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఇపుడు సినీ పరిశ్రమలో ఈ అరెస్టు కల్లోలం సృష్టిస్తోంది. ఎపుడు ఎవర్ని ఎన్​సీబీ విచారణకు పిలుస్తుందో అంటూ బిక్కుబిక్కుమంటున్నారు డ్రగ్స్ బాధితులు.

Last Updated : Sep 8, 2020, 9:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.