"అందరూ ఈమధ్య కరోనాకు భయపడుతున్నారు. కానీ మా సినిమా చూసిన తర్వాత దెయ్యానికి భయపడతార"ని చెప్పారు స్వాతి దీక్షిత్. ఆమె ప్రముఖ నటుడు రాజశేఖర్‌కి కూతురుగా నటించిన చిత్రం 'ఆర్జీవీ దెయ్యం'. రామ్‌గోపాల్ వర్మ దర్శకుడు. జీవిత రాజశేఖర్, నట్టి కరుణ, నట్టి క్రాంతి, బోగారం వెంకట శ్రీనివాస్ నిర్మాతలు. ఈ నెల 16న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది.
ఈ సందర్భంగా చిత్రబృందం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు మాట్లాడుతూ.. "మేం ఈ సినిమాలో కొన్ని మార్పులు చేశాక.. అంతకుముందు అనుకున్న పేరు కంటే ఇది మంచి పేరు అనుకుని 'దెయ్యం' అని పెట్టాం" అన్నారు. 600కిపైగా థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేస్తున్నామన్నారు నట్టికుమార్.
ఇదీ చూడండి: అయిషా శర్మ హాట్ పిక్స్ అదిరెన్