ఎన్టీఆర్ బయోపిక్ నిర్మిస్తున్నట్లు రామ్ గోపాల్ వర్మ ప్రకటన నుంచే వివాదాలు మొదలయ్యాయి. తర్వాత వీడియోలు, పాటలతో మరింత రచ్చ చేశాడు ఆర్జీవీ. 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా విడుదలను నిలిపివేయాలనే పిటిషన్లు, వాటిని సవాల్ చేస్తూ వర్మ కామెంట్లతో మరింత హైప్ క్రియేటైంది. పలువురు రాజకీయ నాయకుల చిత్రాలు, ప్రసంగాలను ఉపయోగించి ప్రచారం చేసుకున్న వర్మ... తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఉపయోగించుకున్నాడు.
- ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాపై మీ అభిప్రాయం ఏమిటని ట్రంప్‌ను ఒక వ్యక్తి ప్రశ్నిస్తారు. అందుకు సమాధానంగా ‘‘ఇది తప్పక చర్చించాల్సిన అంశం. అక్కడ ఏం జరుగుతోందనే సమాచారం మనకు ఉండాలి. ఈ సినిమా విడుదలౌతుంది.’’ అంటూ ట్రంప్ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ప్రస్తుతం ఈ స్పూఫ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
.
This is what @realDonaldTrump says about #LakshmisNTR pic.twitter.com/VD4g20kAhS
— Ram Gopal Varma (@RGVzoomin) March 22, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
">This is what @realDonaldTrump says about #LakshmisNTR pic.twitter.com/VD4g20kAhS
— Ram Gopal Varma (@RGVzoomin) March 22, 2019This is what @realDonaldTrump says about #LakshmisNTR pic.twitter.com/VD4g20kAhS
— Ram Gopal Varma (@RGVzoomin) March 22, 2019
మరిన్ని సంచనాలు సృష్టించేనా..?:
త్వరలో వైఎస్ఆర్, కేసీఆర్ బయోపిక్‌లు తీయాలనుకుంటున్నట్లుగా తెలిపి షాక్ ఇచ్చాడు వర్మ. ఈ బయోపిక్ ల పర్వాన్ని ఎన్టీఆర్‌తో వదిలేయకుండా వరుసగా సినిమాలు తీయాలని భావిస్తున్నట్లుగా తెలిపాడు. వైఎస్ఆర్ సినిమా గురించి ఓ చిన్న స్టోరీ లైన్ కూడా వదిలాడు. చిత్ర కథ ఆయన మరణంతో ప్రారంభం అవుతుంది తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను తీయనున్నట్లు వెల్లడించాడు.