ETV Bharat / sitara

రామ్​గోపాల్​ వర్మ దర్శకత్వంలో మరోసారి అమితాబ్​? - అమితాబ్​ బచ్చన్ ఆర్జీవీ

అమితాబ్​ బచ్చన్​- వివాదస్పద దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ కాంబోలో మరో చిత్రం రూపొందనుందా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్​ వర్గాలు. వర్మ చెప్పిన కథ నచ్చడం వల్ల అమితాబ్​ అందుకు అంగీకరించారని తెలుస్తోంది. వచ్చే ఏడాదిలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుందని ప్రచారం జరుగుతోంది.

RGV and amitabh bachchan to team up again?
రామ్​గోపాల్​ వర్మ దర్శకత్వంలో మరోసారి అమితాబ్​?
author img

By

Published : Jun 6, 2021, 8:36 AM IST

Updated : Jun 6, 2021, 11:36 AM IST

బాలీవుడ్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, వివాదస్పద దర్శకుడు రామ్​గోపాల్‌ వర్మ పేరు చెప్పగానే గుర్తుకొచ్చే చిత్రం 'సర్కార్‌'. 2005లో పొలిటికల్‌ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంగా వచ్చిన ఈ చిత్రంలో అమితాబ్ ప్రధాన పాత్ర పోషించగా అభిషేక్ బచ్చన్, కోట శ్రీనివాసరావు, అనుపమ్ ఖేర్ ఇతర పాత్రల్లో నటించి అలరించారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'సర్కార్ రాజ్‌'(2008), 'సర్కార్‌ 3' (2017) విడుదలై మెప్పించాయి.

ఇప్పుడు అమితాబ్‌ - వర్మ కలిసి ఓ సినిమా చేయనున్నారని సమాచారం. రామ్​​గోపాల్​ వర్మ గత కొన్నేళ్లుగా ఆ సినిమాకోసం స్క్రిప్టు సిద్ధం చేశారట. ఇందులోని ప్రధాన పాత్రకోసం అమితాబ్‌ని సంప్రదించారు. వర్మ చెప్పిన కథ నచ్చడం వల్ల అమితాబ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని సమాచారం.

ప్రస్తుతం దావూద్‌ ఇబ్రహీం జీవితం ఆధారంగా తెరకెక్కించే వెబ్‌ సీరీస్‌లో వర్మ బిజీగా ఉన్నారు. ఈ సీరీస్‌ పూర్తయ్యాక అమితాబ్‌ నటించే సినిమా పనులు మొదలు పెట్టే యోచనలో ఉన్నాడట. మరో వైపు అమితాబ్‌ 'డెడ్లీ', 'ది ఇంటర్న్'తో పాటు మరికొన్ని హిందీ సినిమాల్లో నటిస్తున్నారు. మొత్తంమీద వచ్చే ఏడాదిలో వర్మ - అమితాబ్‌ల చిత్రం సెట్స్‌ పైకి వెళ్లనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

ఇదీ చూడండి: బాలయ్య కోసం మరో కథ సిద్ధమైందా?

Last Updated : Jun 6, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.