ETV Bharat / sitara

మహేశ్​ చిత్రంతో రేణు దేశాయ్ రీఎంట్రీ! - మహేశ్ బాబు వార్తలు

అడివి శేష్ హీరోగా 'మేజర్' అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి మహేశ్ బాబు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ మూవీలో ఓ కీలకపాత్ర కోసం రేణు దేశాయ్​ను తీసుకున్నట్లు సమాచారం.

Renu Desai reentry with Mahesh Babu film
రేణు దేశాయ్
author img

By

Published : Jun 25, 2020, 9:38 PM IST

సూపర్ స్టార్ మహేశ్​ బాబు నిర్మాతగా అడివి శేష్ హీరోగా 'మేజర్'​ అనే చిత్రం తెరకెక్కుతోంది. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఓ ఆసక్తికర వార్త చిత్రసీమలో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం రేణు దేశాయ్​ను తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే మహేశ్ ఆ పాత్రకు ఆవిడయితేనే బాగుంటుందని ఆఫర్​ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముందట.

ఇప్పటికే రీఎంట్రీ కోసం రేణు దేశాయ్​ ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. కొన్ని పాత్రలు తన వద్దకు వచ్చినా.. మచి రోల్​ కోసం ఆమె ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.