కరోనా వల్ల ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇబ్బందులు పడుతున్నాయి. సాధారణ ప్రజలే కాకుండా, పలు రంగాలూ ప్రభావితమయ్యాయి. దీని వల్ల ఇప్పడు బాండ్ కొత్త సినిమాకు చుక్కెదురైంది. ఏప్రిల్‌లో విడుదల కావాల్సిన 'నో టైమ్ టూ డై'.. ఏకంగా నవంబరుకు వాయిదా పడింది.
![No Time To Die delayed amid coronavirus fears](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6299261_james-bond-2.jpg)
ఇంతకు ముందు ఈ సినిమాకు జరగాల్సిన ప్రచారానికి కరోనా సెగ తగిలింది. ఈ వైరస్ కారణంగానే చైనా, బీజింగ్ ఇతర నగరాల్లో జరగాల్సిన కార్యక్రమాలు ఆగిపోయాయి.
డేనియల్ క్రెయిగ్.. బాండ్‌గా కనిపించనున్న చివరి చిత్రమిదే. ఇందులో మరోసారి బ్రిటీష్ గూఢచారిగా అలరించబోతున్నాడు. ఆస్కార్ నటుడు రమీ మాలిక్.. ప్రతినాయకుడి పాత్ర పోషించాడు. జోజి ఫుకునాగా దర్శకత్వం వహించాడు.
ఇదీ చూడండి.. ఆరేళ్ల వయసులోనే వేధింపులకు గురయ్యాను: నటి రష్మీ