బాలీవుడ్ ప్రముఖ నటి రేఖ నివాసంలో కరోనా కలకలం సృష్టించింది. ముంబయి బాంద్రా ప్రాంతంలోని నటి బంగ్లాకు చెందిన సెక్యూరిటీ సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో ముంబయి మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఆమె భవంతిని మూసేసింది.
సీ స్ప్రింగ్‌గా పిలిచే ఈ భవన్‌ను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేశారు. అయితే, ఈ విషయం గురించి రేఖ ఎటువంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం కరోనా సోకిన గార్డుకు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
బాలీవుడ్ తారలకు చెందిన సిబ్బంది క్రమంగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే ఆమిర్‌ఖాన్, కరణ్ జోహర్, బోనీ కపూర్లు తమ సిబ్బందికి వైరస్ సోకినట్లు తెలిపారు.
ఇదీ చదవండి:నిలకడగా బిగ్‌బీ ఆరోగ్యం.. ఐసోలేషన్ వార్డులో చికిత్స