అజయ్‌దేవ్‌గణ్ ప్రధానపాత్రలో నటించిన చిత్రం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా'. ఈ సినిమా ఆగస్టు13(శుక్రవారం) ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఓటీటీ వేదికలపై అజయ్‌దేవ్‌గణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నిబంధనలు ఉండటం ముఖ్యమే కానీ.. అవి మరీ ఆందోళన కలిగేంచే విధంగా ఉండొద్దని అభిప్రాయపడ్డారు.
రూల్స్ ఉండాల్సిందే..
"ఓటీటీల్లో నిబంధనలు లేకుంటే.. ప్రజలు దానిని అవకాశంగా తీసుకుంటారు. అలానే మరికొంతమంది ఆలోచిస్తే మొత్తం ఇండస్ట్రీ నాశనం అవుతుంది. నిబంధనలు లేకపోతే.. పోర్న్ సైతం ఓటీటీల్లో పెడతారు. అందుకే రూల్స్, రెగులేషన్స్ ఉండటం ముఖ్యం కానీ.. అవి ఒక పరిధి వరకు ఉంటేనే ఉత్తమం" అని అజయ్‌దేవ్‌గణ్ చెప్పుకొచ్చారు.
1997లో భారత్-పాకిస్థాన్ మధ్య గుజరాత్లో జరిగిన యుద్ధ నేపథ్యంతో 'భుజ్' చిత్రాన్ని రూపొందించారు. సోనాక్షి సిన్హా, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు.
ఎస్.ఎస్.రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'లోనూ అజయ్‌దేవ్‌గణ్ ముఖ్యమైన పాత్ర చేస్తున్నారు. యంగ్‌టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.
ఇవీ చదవండి: