అద్భుత దృశ్యమాలిక 'రామాయణ్'.. దూరదర్శన్ ఛానెల్లో మరోసారి ప్రసారమవుతూ ఎన్నో ఘనతల్ని సాధిస్తోంది. ప్రపంచ రికార్డుల్ని కొల్లగొడుతోంది. ఈ నేపథ్యంలోనే గతనెల 16న ప్రసారమైన ఎపిసోడ్.. 7.7 కోట్ల వీక్షణలతో ప్రపంచంలో అత్యధికులు చూసిన టీవీషోగా నిలిచింది. ఈ విషయాన్ని డీడీ నేషనల్ తన ట్విట్టర్లో పంచుకుంది.
-
WORLD RECORD!!
— Doordarshan National (@DDNational) April 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Rebroadcast of #Ramayana on #Doordarshan smashes viewership records worldwide, the show becomes most watched entertainment show in the world with 7.7 crore viewers on 16th of April pic.twitter.com/hCVSggyqIE
">WORLD RECORD!!
— Doordarshan National (@DDNational) April 30, 2020
Rebroadcast of #Ramayana on #Doordarshan smashes viewership records worldwide, the show becomes most watched entertainment show in the world with 7.7 crore viewers on 16th of April pic.twitter.com/hCVSggyqIEWORLD RECORD!!
— Doordarshan National (@DDNational) April 30, 2020
Rebroadcast of #Ramayana on #Doordarshan smashes viewership records worldwide, the show becomes most watched entertainment show in the world with 7.7 crore viewers on 16th of April pic.twitter.com/hCVSggyqIE
ఈ సీరియల్‌కు రమానంద్ సాగర్ దర్శకుడిగా, నిర్మాతగా బాధ్యతలు నిర్వర్తించారు. లాక్డౌన్ వల్ల ఇంట్లోనే ఉన్న ప్రజల కోసం, మార్చి 28 నుంచి, కేంద్ర ప్రభుత్వం మరోసారి దీనిని ప్రసారం చేస్తోంది. మొత్తంగా 78 ఎపిసోడ్లు ఉన్న ఈ ధారావాహికను వాల్మీకి రామాయణం, తులసీదాస్ రామచరిత్ మానస్ ఆధారంగా రూపొందించారు. ప్రస్తుతం ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్(దూరదర్శన్) ఛానల్‌లో వస్తోంది.
1987 జనవరి 25 నుంచి 1988 జులై 31 వరకు ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు 'రామాయణ్' ప్రసారమయ్యేది. అప్పట్లోనే ప్రపంచంలో అత్యధికులు వీక్షిస్తున్న సీరియల్‌గా రికార్డు సంపాదించింది. దీనితో పాటే ఎక్కువ మంది చూసిన పౌరాణిక సీరియల్‌గానూ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల్లో చోటు దక్కించుకుంది.