యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కొత్తగా ఓ సినిమా ఒప్పుకున్నారంటే... ఇప్పుడు జాతీయ స్థాయిలో దాని గురించి చర్చ మొదలవుతుంది. తెలుగు కథానాయకుడే అయినా.. పాన్ ఇండియా స్థాయి ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు ప్రభాస్. తెలుగులో ప్రయాణం మొదలుపెట్టి అంచలంచలుగా ఎదిగారు. దక్షిణాదిలోనే కాదు, ఉత్తరాదిలోని అన్ని భాషల్లోనూ ఆయనకి అభిమానులున్నారు. ఒక స్టార్‌గా సత్తా చాటారు. నటుడిగానూ నిరూపించుకున్నారు. బుధవారంతో 18 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారాయన.
ప్రభాస్ తొలి చిత్రం 'ఈశ్వర్' 2002, నవంబర్ 11న విడుదలైంది. ప్రస్తుతం ప్రభాస్ కథానాయకుడిగా దాదాపు రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులతో, మూడు పాన్ ఇండియా చిత్రాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటి గురించి జాతీయ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. భారతీయ సినీ మార్కెట్ పాలిట ప్రభాస్ నిజంగానే ఇప్పుడొక బాహుబలి. ఈ సందర్భంగా ఆయన అభిమానులు సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రభాస్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. శుభాకాంక్షలు చెబుతున్నారు. ప్రస్తుతం 'రాధేశ్యామ్'లో నటిస్తున్నారు ప్రభాస్.
ఛార్మి పెంపుడు కుక్కతో..
-
#Darling with my 9 months old baby boy ♥️
— Charmme Kaur (@Charmmeofficial) November 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
.
.
.#prabhas #alaskanmalamute @puriconnects pic.twitter.com/4Fr10ViBab
">#Darling with my 9 months old baby boy ♥️
— Charmme Kaur (@Charmmeofficial) November 10, 2020
.
.
.#prabhas #alaskanmalamute @puriconnects pic.twitter.com/4Fr10ViBab#Darling with my 9 months old baby boy ♥️
— Charmme Kaur (@Charmmeofficial) November 10, 2020
.
.
.#prabhas #alaskanmalamute @puriconnects pic.twitter.com/4Fr10ViBab
నటి, నిర్మాత ఛార్మికి పెంపుడు కుక్కలంటే ఎంతో ఇష్టం. ఆమే తన కుక్క పిల్లలతో కలిసి చెప్పుకునే ముచ్చట్లు సామాజిక మాధ్యమాల్లో వినిపిస్తూనే ఉంటాయి. ప్రభాస్‌కూ తన కుక్క పిల్లని పరిచయం చేసింది ఛార్మి. అలస్కాన్ మాలమ్యూట్ రకానికి చెందిన నా తొమ్మిది నెలల కుక్క పిల్లతో డార్లింగ్ అంటూ ఫోటోని ట్వీట్ చేసింది ఛార్మి. అది నెటిజన్లని ఆకట్టుకుంటుంది.
ఇదీ చూడండి:ప్రభాస్ 'రాధేశ్యామ్'లో హాలీవుడ్ యాక్షన్