ETV Bharat / sitara

'రాధేశ్యామ్​'లో పరమహంసగా రెబల్​స్టార్​! - రాధేశ్యామ్​లో కృష్ణంరాజు

డార్లింగ్​ ప్రభాస్​ హీరోగా తెరకెక్కుతోన్న 'రాధేశ్యామ్​' చిత్రంలో దిగ్గజ నటుడు​ కృష్ణంరాజు నటించనున్నారని సమాచారం. ప్రేమకథ నేపథ్యంలో రూపొందుతోన్న ఈ సినిమాలోని పరమహంస పాత్రలో రెబల్​స్టార్​ దర్శనమివ్వనున్నారని ప్రచారం జరుగుతోంది.

Rebel Star Krishnam Raju to play crucial role in Prabhas's Radhe Shyam
'రాధేశ్యామ్​'లో పరమహంసగా రెబల్​స్టార్​!
author img

By

Published : Jan 22, 2021, 9:42 AM IST

Updated : Jan 22, 2021, 11:48 AM IST

'బాహుబలి', 'సాహో' చిత్రాలతో పసందైన యాక్షన్‌ హంగామాను చూపించారు అగ్ర కథానాయకుడు ప్రభాస్‌. అందుకే ఇప్పుడాయన కొత్తగా 'రాధేశ్యామ్‌'తో ఓ విభిన్నమైన ప్రేమకథను రుచి చూపించేందుకు సిద్ధమయ్యారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. గోపీకృష్ణ మూవీస్‌, యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్నాయి. పూజా హెగ్డే నాయిక. ఇందులో ప్రభాస్‌ పెదనాన్న.. సీనియర్‌ నటుడు కృష్ణంరాజు ఓ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

ప్రభాస్​, కృష్ణంరాజు గతంలో 'బిల్లా', 'రెబల్‌' చిత్రాల్లో కలిసి నటించారు. ఇప్పుడిన్నాళ్ల తర్వాత మళ్లీ ఈ చిత్రం కోసం తెర పంచుకోనున్నారని తెలుస్తోంది. రాధేశ్యామ్​లో 'పరమహంస' అనే పాత్రలో కృష్ణంరాజు దర్శనమిస్తారని తెలుస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం హైదరాబాద్‌లో తుది దశ చిత్రీకరణలో ఉంది.

ఇదీ చూడండి: బిగ్గెస్ట్​​ యాక్షన్ డ్రామా​లో రామ్​చరణ్​-యశ్​​!

Last Updated : Jan 22, 2021, 11:48 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.