ETV Bharat / sitara

Real Story Movies: వెండితెరపైకి యథార్థకథలు - ది కశ్మీర్‌ ఫైల్స్‌

Real Story Movies: కల్పిత కథలు.. చారిత్రక గాథలు.. నిజ జీవితాల ఆధారంగా రూపొందే బయోపిక్‌లు.. ఇలా వెండితెరపై ప్రాణం పోసుకొనే కథాంశాలు  కోకొల్లలు. వీటిలో వాస్తవికత నిండిన కథలకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది. సమాజాన్ని కదిలించిన విషాద ఘటనలు కావొచ్చు.. యావత్‌ జాతిపైనే ప్రభావం చూపించిన యథార్థ సంఘటనలు కావొచ్చు. ఈ తరహా కథాంశాలతో రూపొందే చిత్రాలెప్పుడూ ప్రేక్షకుల మదిపై చెరగని ముద్ర వేస్తుంటాయి. ఇప్పుడీ తరహా సినిమాలు బాలీవుడ్‌ నుంచి విరివిగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అవి ఇటు సినీప్రియుల్లోనూ.. అటు రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశాలుగా మారుతున్నాయి.

telugu movies
వెండితెరపైకి యథార్థకథలు
author img

By

Published : Mar 20, 2022, 6:50 AM IST

Real Story Movies: అంతర్జాలం.. ఓటీటీ వేదికలు అందుబాటులోకి వచ్చాక సినీ ప్రియుల అభిరుచుల్లో చాలా మార్పులొచ్చాయి. ప్రపంచ సినిమాలకు బాగా అలవాటు పడటంతో.. అందుకు తగ్గట్లుగా మన కథల్లోనూ మార్పులు కోరుకుంటోంది ప్రేక్షక లోకం. కృతిమ కథలు, తర్కానికి అందని కథాంశాలను చూడటం కంటే.. వాస్తవికత ఉట్టిపడే సినిమాల్ని చూసేందుకే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ప్రేక్షకుల అభిరుచుల్లో వచ్చిన ఈ మార్పుల్ని గమనించే సినీ రచయితలు, దర్శకులు ఆ తరహా కథలతో ప్రయోగాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే యావత్‌ దేశాన్ని కదిలించిన అనేక యథార్థ గాథలు వెండితెరపైకి దృశ్య కావ్యాలుగా వస్తున్నాయి.

uri the surgical strike
'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పలు వాస్తవ సంఘటనలతో ఇప్పటికే వెండితెరపై అనేక సినిమాలొచ్చాయి. 90ల్లో దర్శకుడు మణిరత్నం నుంచి వచ్చిన 'రోజా', 'బొంబాయి' సినిమాలకు ఈ తరహా కథాంశాల స్ఫూర్తిగా నిలిచాయి. కశ్మీర్‌ తీవ్రవాద సమస్యను ఓ ప్రేమకథ కోణంలో నుంచి 'రోజా'లో కళ్లకు కట్టినట్లు చూపించారు మణిరత్నం. ఇది అప్పట్లో బాక్సాఫీస్‌ ముందు భారీ విజయాన్ని అందుకొంది. ఇక 1995లో వచ్చిన 'బొంబాయి' దేశవ్యాప్తంగా పెద్ద సంచలనాన్నే సృష్టించింది. బాబ్రీ మసీద్‌ కూల్చివేత తర్వాత ముంబయిలో చెలరేగిన మతకలహాల నేపథ్యంలో తీసిన చిత్రమిది. ఈ సున్నితమైన అంశాన్ని ఓ అందమైన ప్రేమకథతో ముడిపెడుతూ 'బొంబాయి'ని తెరకెక్కించిన తీరు అందరినీ మెప్పించింది. అప్పట్లో ఈ సినిమాపై పలు రాష్ట్రాల్లో వివాదాలు చెలరేగాయి. అయితే వీటన్నింటినీ దాటుకొని సినిమా బాక్సాఫీస్‌ ముందు వసూళ్ల వర్షం కురిపించింది. ఇటీవల కాలంలో ఈతరహా చిత్రాలకు మళ్లీ ఊపు తీసుకొచ్చిన సినిమా 'ఉరి: ది సర్జికల్‌ స్ట్రైక్‌'. విక్కీ కౌశల్‌ హీరోగా ఆదిత్య ధర్‌ తెరకెక్కించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. 2016 నాటి ఉరీ దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్‌లోని ముష్కర మూకలపై భారత ప్రభుత్వం పారా స్పెషల్‌ ఫోర్సెస్‌తో మెరుపు దాడులు చేసింది. ఈ సర్జికల్‌ స్ట్రైక్‌ ఆపరేషన్‌ స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించిన చిత్రమే 'ఉరి'. 2019 జనవరి 11న విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా సంచలన విజయాన్ని అందుకోవడంతో పాటు నాలుగు జాతీయ అవార్డులను అందుకొంది. రూ.25కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఈ సినిమా అప్పట్లో దాదాపు రూ.342కోట్ల వసూళ్లు సాధించడం విశేషం.

ఆ బాటలో 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌'

state of sieze
'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌'

భారత సైన్యం చేపట్టిన ఓ రియల్‌ ఆపరేషన్‌ ఆధారంగా రూపొందిన చిత్రం 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: టెంపుల్‌ అటాక్‌'. 'స్టేట్‌ ఆఫ్‌ సీజ్‌: 26/11 అటాక్‌'కు కొనసాగింపుగా రూపొందింది. అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రలో నటించిన చిత్రమిది. కెన్‌ ఘోష్‌ తెరకెక్కించారు. 2002లో గుజరాత్‌లోని అక్షరధామ్‌ దేవాలయంపై జరిగిన దాడి.. ఆ దాడికి సంబంధించిన నేరస్థులను తుదముట్టించడానికి ఎన్‌ఎస్‌జీ కమాండోలు చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ నేపథ్యంలో అల్లుకున్న కథతో రూపొందింది. గతేడాది జులై 9న ప్రముఖ ఓటీటీ వేదిక 'జీ5'లో విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంది.
ఇదే బాటలో 'మేజర్‌' చిత్రం రూపొందుతోంది. అడివిశేష్‌ కథానాయకుడిగా 26/11 ముంబయి ఉగ్ర దాడుల్లో వీరమరణం పొందిన సందీప్‌ ఉన్ని కృష్ణన్‌ జీవితాధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. శశికిరణ్‌ తిక్కా దర్శకత్వం వహించారు. దేశం మొత్తం దిగ్భ్రాంతికి గురైన ఈ ఘటనపై తెరకెక్కిస్తున్నారు. మే 27న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేస్తున్నారు.

అదే అసలు సవాల్‌..

వాస్తవ ఘటనలతో సినిమా చేయడం ఎంత సులభమో.. అంతే పెద్ద సవాల్‌. చాలా మందికి తెలిసిన విషయాలే ఉంటాయి కాబట్టి.. పోల్చి చూసుకునే అవకాశాలు ఎక్కువ. ముఖ్యంగా రాజకీయాలు, కులాలు, మతాలతో ముడిపడి ఉన్న కథలు చెప్పేటప్పుడు దర్శకులు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి కథలు రెండంచుల ఖడ్గం లాంటివి. జరిగిన విషయాల్ని వక్రీకరించినా ప్రమాదమే.. కొన్నిసార్లు యథాతథంగా చూపించాలన్న ఇబ్బందే. ఏ వర్గాన్ని నొప్పించకుండా ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా సుతిమెత్తగా చెప్పడం సవాల్‌తో కూడిన వ్యవహారం. దీని కోసం ప్రత్యేకమైన పరిశోధన, పరిశీలన... ఎవరినీ నొప్పించకుండా తీయగలిగే నేర్పు అవసరం. వాటిని ఒడిసిపట్టిన దర్శక, నిర్మాతలు... విజయాలు అందుకుంటున్నారు.

కదిలిస్తున్న 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'

The kashmir files
'ది కశ్మీర్‌ ఫైల్స్‌'

వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొంది.. ఇప్పుడు దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తున్న చిత్రం 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'. ప్రముఖ దర్శకుడు వివేక్‌ అగ్నిహోత్రి తెరకెక్కించారు. 90వ దశకంలో కశ్మీర్‌ పండిట్‌లపై జరిగిన దారుణ మారణకాండకు దృశ్య రూపమే ఈ చిత్రం. 1990లో కశ్మీర్‌ హిందూ పండిట్‌లపై తీవ్రవాదులు, వేర్పాటువాదులు దాడులు చేశారు. వేల మంది పండిట్‌లను ఊచకోత కోయడమే కాక వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఆ సమయంలో అనేక మంది పండిట్‌లు ప్రాణ భయంతో ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 32ఏళ్ల క్రితం జరిగిన ఈ దారుణ ఘటనలను 'ది కశ్మీర్‌ ఫైల్స్‌'లో ఎంతో భావోద్వేగభరితంగా కళ్లకు కట్టినట్లు చూపించారు వివేక్‌ అగ్నిహోత్రి. అనుపమ్‌ ఖేర్‌, మిథున్‌ చక్రవర్తి, దర్శన్‌ కుమార్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. ఇటీవలే విడుదలై మంచి ఆదరణ దక్కించుకుంటోంది. రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో దూసుకెళుతోంది. ఇదే సమయంలో ఇప్పుడీ సినిమా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగానూ మారుతోంది.

ఇదీ చదవండి: చిరంజీవి ఎన్నో మాటలు పడ్డారు.. చరణ్​కు తెలియదు: రాజమౌళి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.