ETV Bharat / sitara

రవితేజ 'రాజా ది గ్రేట్‌'కు సీక్వెల్‌ రానుందా? - రవితేజ రాజా ది గ్రేట్​ సీక్వెల్​ అనిల్​ రావిపూడి

అనిల్ ​రావిపూడి దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కిన 'రాజా ది గ్రేట్‌' సినిమాకు సీక్వెల్​ తెరకెక్కనుందని సమాచారం. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ ఏడాది చివర్లో కానీ, వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది.

Raviteja
రవితేజ
author img

By

Published : May 1, 2021, 3:24 PM IST

Updated : May 1, 2021, 4:42 PM IST

మాస్‌ మహారాజ రవితేజ కథానాయకుడిగా అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రాజా ది గ్రేట్‌'. 2017లో యాక్షన్‌ కామెడీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకొచ్చి అలరించింది. అయితే ఈ చిత్రానికి సీక్వెల్‌గా 'రాజా 2 ది గ్రేట్‌' టైటిల్‌తో రానుందని అనే వార్తలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. అనిల్ రావిపూడి ఓ సందర్భంలో ఈ చిత్రం సీక్వెల్‌ గురించి చెబుతూ.. "రాజా ది గ్రేట్‌ సినిమాకు సీక్వెల్‌ కచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్పలేను" అని తెలిపారు.

దర్శకుడు అనిల్‌ ఇటీవల హీరో రవితేజకు చిత్రానికి సంబంధించి స్టోరీలైన్‌ వినిపించారట. అయితే రవితేజ మాత్రం పూర్తి స్క్రిప్ట్‌తో రావాలని దర్శకుడిని కోరారట. అన్నీ సవ్యంగా కుదిరితే ఈ ఏడాది చివర్లో కానీ, లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కిన 'రాజా ది గ్రేట్‌' చిత్రంలో లక్కీగా మెహరీన్‌ నటించగా, ప్రకాష్‌రాజ్‌ పోలీస్‌ అధికారిగా, రాధిక-రవితేజ తల్లి పాత్రలో నటించింది. హాస్యనటుడు శ్రీనివాసరెడ్డి, సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్‌, తనికెళ్ల భరణి తదితరులు ఇతర పాత్రల్లో నటించి అలరించారు. ప్రస్తుతం రవితేజ 'ఖిలాడి' చిత్రం చేస్తుండగా అనిల్ రావిపూడి 'ఎఫ్‌ 3' చిత్రానికి దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు.

ఇదీ చూడండి: మాస్​ మహారాజా జోరు- మరో చిత్రానికి ఓకే​!

Last Updated : May 1, 2021, 4:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.