మాస్ మహారాజా రవితేజ నటిస్తోన్న చిత్రం 'క్రాక్'. శ్రుతి హాసన్ కథానాయిక. ఈ సినిమా ఈ ఏడాది వేసవికి విడుదల కావాల్సింది. కానీ లాక్డౌన్ కారణంగా చిత్రీకరణ తాత్కాలికంగా నిలిచిపోయింది. గతనెలలోనే తిరిగి ప్రారంభమైంది. ప్రస్తుతం ఓ పాట మినహా దాదాపుగా నేటితో పూర్తైంది. పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదల కానుంది.
-
#krack Sankranthi 2021 release pic.twitter.com/uM05TLCDCN
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">#krack Sankranthi 2021 release pic.twitter.com/uM05TLCDCN
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2020#krack Sankranthi 2021 release pic.twitter.com/uM05TLCDCN
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2020
ఈ చిత్రానికి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ పతాకంపై బి.మధు నిర్మిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందుతోందీ సినిమా. వరలక్ష్మి, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీత స్వరాలు సమకూర్చారు.
ఇదీ చూడండి : ఉప్పెన: 'రంగులద్దుకున్న' ప్రేమ గీతం