Raviteja khiladi movie: మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి'.. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది. తొలుత తెలుగులో మాత్రమే రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు హిందీలో అదే తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
![raviteja khiladi movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380136_khiladi-movie.jpg)
ఈ మధ్యే 'పుష్ప' హిందీ వెర్షన్ రూ.100 కోట్ల వసూళ్లు సాధించి, తెలుగు సినిమా సత్తా ఏంటో నిరూపించింది. ఈ క్రమంలో 'ఖిలాడి' చిత్రాన్ని అక్కడ రిలీజ్ చేస్తున్నారు.
'ఖిలాడి' సినిమాలో రవితేజ.. ద్విపాత్రాభినయం చేశారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు.
Sebastian Teaser: కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న 'సెబాస్టియన్ పీసీ524' సినిమా టీజర్ రిలీజైంది. నవ్విస్తూనే ఈ టీజర్ ఆసక్తిని పెంచేస్తోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇందులో కిరణ్.. కానిస్టేబుల్ సెబాస్టియన్‌గా నటించారు. ఇతడికి రేచీకటి కూడా ఉంది. అలాంటి ఓ కానిస్టేబుల్ నైట్ డ్యూటీ చేయాల్సి వస్తుంది. ఆ తర్వాత ఎదురైన పరిణామాలు ఏంటనేది తెలియాలంటే ఈ సినిమా చూడాలి. ఈ చిత్రంలో కోమలి ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించారు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు.
DJ Tillu movie: 'డీజే టిల్లు' సెన్సార్ పూర్తయింది. యూబైఏ సర్టిఫికెట్ సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 12న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో సిద్ధు, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించారు. విమల్ కృష్ణ దర్శకత్వం వహించారు.
![DJ Tillu movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380136_dj-tillu-movie.jpg)
సత్యదేవ్- తమన్నా జంటగా నటించిన సినిమా 'గుర్తుందా శీతాకాలం'. ఈ సినిమా టైటిల్ సాంగ్ శనివారం రిలీజైంది. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం 'జేమ్స్'.. మార్చి 17న రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11న ఉదయం 11:11 గంటలకు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
![puneeth rajkumar james movie](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/14380136_james-movie.jpg)
ఇవీ చదవండి: