మలయాళ హిట్ 'డ్రైవింగ్ లైసెన్స్' సినిమా హక్కుల్ని రామ్‌చరణ్ ఎప్పుడో కొనేశారు. అయితే ఆ ప్రాజెక్టు ఎప్పుడు మొదలవుతుంది? తెలుగులో ఎవరెవరు చేస్తారు? అనేది ఇంతవరకు స్పష్టత రాలేదు. అయితే ఈ మధ్య కాలంలో దాని గురించి మళ్లీ మాట్లాడుకుంటున్నారు. రవితేజ, విజయ్ సేతుపతి ఈ రీమేక్‌లో ప్రధాన పాత్రలు పోషించనున్నారని సమాచారం. ఇదే నిజమైతే మాస్ మహారాజా అభిమానులకు పండగే.
ఓ స్టార్ హీరోకు, ఆయన వీరాభిమాని అయిన ఆర్టీఓ అధికారికి అహం(ఇగో) విషయంలో గొడవతలెత్తితే.. చివరకు ఏమైంది అనేదే చిత్ర కథాంశం. ఒరిజినల్లో పృథ్వీరాజ్, సూరజ్ వెంజరమూడు తన నటనతో అదరగొట్టేశారు.
![Driving License telugu remake](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11079397_dr-l.jpg)