మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi Movies) సినిమాలో రవితేజ(Ravi Teja Latest Movie) నటించనున్నారా? ఆ మేరకు చర్చలు ఊపందుకున్నాయా?- ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. చిరు కథానాయకుడిగా కె.ఎస్.రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ దసరాకే చిత్రీకరణ ఆరంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందులో చిరుతోపాటు మరో కథానాయకుడు చేయాల్సిన ఓ పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం రవితేజను(Ravi Teja Latest Movie) సంప్రదించినట్టు, చర్చలు సాగుతున్నట్టు తెలిసింది.
గతంలోనూ..
చిరంజీవి(Chiranjeevi Latest Movie) సినిమాలో రవితేజ నటించడం కొత్తేమీ కాదు. 'అన్నయ్య'తోపాటు 'శంకర్‌దాదా జిందాబాద్'లోనూ మెరిశారు రవితేజ. అన్నీ కుదిరితే మరోసారి ఆ ఇద్దరూ కలిసి సందడి చేయనున్నారు.
చిరంజీవి 'ఆచార్య'(Acharya Release Date) షూటింగ్ పూర్తిచేసుకుని.. విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు ఆయన.. 'గాడ్‌ఫాదర్', మెహర్ రమేశ్ దర్శకత్వంలో 'భోళాశంకర్' చిత్రాలు చేస్తున్నారు. మరోవైపు రవితేజ 'రామారావు ఆన్ డ్యూటీ', 'ఖిలాడీ'(Khiladi Ravi Teja Release Date) సినిమాలతో బిజీగా గడుపుతున్నారు.
ఇదీ చదవండి: 'నాలోని అజ్ఞానమే ఈ కథకు స్ఫూర్తి'