కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడటం వల్ల టాలీవుడ్లో చిత్రీకరణలు ప్రారంభమయ్యాయి. దీంతో హీరోలు సెట్స్‌లో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. మాస్మాహారాజా రవితేజ(Raviteja) కూడా వరుస షూటింగ్స్‌తో బిజీ కానున్నట్లు తెలుస్తోంది. వీలైనంత త్వరగా తన సినిమాలను పూర్తిచేసి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తున్నారట.
'ఖిలాడి' మిగతా భాగాన్ని త్వరలో పూర్తిచేసేయాలని రవితేజ ప్లాన్ చేస్తున్నారు. దానికి సమాంతరంగా శరత్ దర్శకత్వంలోని కొత్త చిత్రం రెగ్యులర్ షూటింగ్‌లోనూ పాల్గొంటారట.
1990 నేపథ్యంలో సాగే కథతో వాస్తవ సంఘటనల ఆధారంగా రవితేజ కొత్త సినిమా తెరకెక్కనుందని సమాచారం. ఇందులో ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. అందులో ఒకరు దివ్యాంశ కౌశిక్(Divyansha Kaushik). మరొకరి ఎంపికపై చిత్రబృందం ప్రస్తుతం దృష్టిపెట్టింది. ఇటీవల రవితేజ కరోనా టీకా తొలి డోసు తీసుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: Ravi Teja: 1990ల్లో నాటి వాస్తవ కథతో!