ETV Bharat / sitara

'ఖిలాడి' సెన్సార్​ పూర్తి.. ఈద్​కే రానున్న సల్మాన్​ - డింపుల్ హయాతి

Ravi Teja Khiladi Movie: కొత్త సినిమాల అప్డేట్లు వచ్చేశాయి. ఇందులో ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా, 'ఎఫ్​ 3', 'ఖిలాడి' సినిమాల విశేషాలున్నాయి.

kabhi eid kabhi diwali
ravi teja khiladi movie
author img

By

Published : Feb 7, 2022, 4:32 PM IST

Ravi Teja Khiladi Movie: మాస్ మహారాజా రవితేజ 'ఖిలాడి'.. ఫిబ్రవరి 11న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా సెన్సార్​ పూర్తి చేసుకుంది. యూబైఏ సర్టిఫికెట్​ సొంతం చేసుకుంది.

ravi teja khiladi movie
'ఖిలాడి'

'ఖిలాడి' సినిమాలో రవితేజ.. ద్విపాత్రాభినయం చేశారు. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్లు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. రమేశ్ వర్మ దర్శకత్వం వహించారు.

ఆనంద్ యాక్షన్​..

Anand Deverakonda New Movie: 'దొరసాని', 'మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌', 'పుష్పక విమానం' తదితర క్లాస్‌ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన నటుడు ఆనంద్‌ దేవరకొండ. తొలిసారి ఆయన ఓ యాక్షన్‌ చిత్రంలో నటిస్తున్నారు. నూతన దర్శకుడు ఉదయ్‌ శెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి 'గం గం గణేశా' అనే టైటిల్‌ ఖరారైంది.

anand deverakonda new movie
'గం గం గణేశా'లో ఆనంద్

ఈ చిత్రం సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. రెగ్యులర్‌ షూటింగ్‌ మరికొన్ని రోజుల్లో ప్రారంభంకానుంది. త్వరలోనే మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఆనంద్‌ ప్రస్తుతం 'బేబీ' అనే చిత్రంలో నటిస్తున్నారు. సాయి రాజేష్‌ దర్శకుడు.

'ఎఫ్‌ 3' డబ్బు పాట

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

వెంకటేశ్‌, వరుణ్‌ తేజ్‌ కథానాయకులుగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఎఫ్ 3'. గతంలో ఇదే కాంబినేషన్‌లో వచ్చిన 'ఎఫ్‌ 2'కి సీక్వెల్‌గా రూపొందుతోంది. తమన్నా, మెహరీన్‌ కథానాయికలు. ఈ సినిమా ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకుతీసుకొస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ క్రమంలో 'లబ్‌డబ్‌ లబ్‌డబ్‌ డబ్బు' అనే పాటను సోమవారం విడుదల చేసింది. భాస్కరభట్ల రచించిన ఈ గీతాన్ని రామ్‌ మిర్యాల ఆలపించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చారు.

ఈద్​కే రానున్న సల్మాన్​..

kabhi eid kabhi diwali
పూజా

సల్మాన్​ ఖాన్​, సాజిద్​ నదియావాలా కాంబినేషన్​లో రానున్న 'కబీ ఈద్​ కబీ దివాలీ' సినిమాను 2023 ఈద్​కు రిలీజ్​ చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్​గా నటించనుంది.

ఇదీ చూడండి: 'సర్కారు వారి పాట' సాంగ్​ కోసం నాలుగు అప్డేట్స్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.