Raveena Tandon Father died: ప్రముఖ నటి రవీనా టాండన్ ఇంట్లో విషాదం నెలకొంది. ఆమె తండ్రి, నిర్మాత రవి టాండన్(86) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యల వల్ల శుక్రవారం ఉదయం ముంబయిలోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఇన్స్టాలో తెలుపుతూ.. తన తండ్రితో కలిసి దిగిన ఫొటోలను రవీనా పోస్ట్ చేసింది. 'మీరెప్పుడు నాతోనే ఉంటారు. నేను కూడా మీతోనే ఉంటాను. లవ్ యు నాన్న' అని భావోద్వేగ వ్యాఖ్య రాసుకొచ్చింది.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
రవి టాండన్ మృతి పట్ల పలువురు సినీప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. కాగా, రవీనా టాండన్ త్వరలోనే 'కేజీఎఫ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం ఆమె పలు చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
ఇదీ చూడండి: రణ్బీర్తో నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది: ఆలియా భట్