ETV Bharat / sitara

Rashmika: ఒకరోజు ఆ అభిమానిని కలుస్తా! - నటి రష్మిక అభిమాని

తనకోసం ఎవరూ సాహసాలు చేయవద్దని అభిమానులను కోరింది బ్యూటీ రష్మిక. ఇటీవల తన కోసం 900కి.మీలు ప్రయాణించిన అభిమానిని కలుసుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసింది.

Rashmika Mandanna
నటి రష్మిక
author img

By

Published : Jun 28, 2021, 5:31 AM IST

తనకోసం ఎవరూ సాహసాలు చేయవద్దని నటి రష్మిక తన అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇటీవల త్రిపాఠి అనే అభిమాని రష్మికను కలిసేందుకు దాదాపు 900కిలోమీటర్లు ప్రయాణించాడు. తెలంగాణ నుంచి కర్ణాటకలోని రష్మిక స్వస్థలం కొడగుకు చేరుకున్నాడు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా ఆమె ఇంటికి వెళ్లి ఆరా తీయగా.. రష్మిక అక్కడ లేదని, ముంబయిలో ఉంటోందని తెలిసింది. దీంతో అక్కడి నుంచి నిరాశగా వెనుదిరిగాడు. కాగా.. ఈ వార్త మీడియాలో వైరల్‌గా మారింది. తిరిగితిరిగి చివరకు రష్మికను చేరింది. ఈ సంఘటనపై స్పందించిన రష్మిక తన అభిమానిని కలుసుకోలేకపోయినందుకు విచారం వ్యక్తం చేసింది. ఇలాంటి సాహసాలు ఎవరూ చేయవద్దని కోరింది.

Rashmika Mandanna
రష్మిక ట్వీట్

"ఒక వీరాభిమాని నన్ను కలిసేందుకు చాలాదూరం ప్రయాణించి కర్ణాటకలోని మా ఇంటికి వెళ్లినట్లు నాకు ఇప్పుడే తెలిసింది. దయచేసి ఇలాంటి పనులు ఎవరూ చేయకండి. ఆ అభిమానిని కలవలేకపోయినందుకు చింతిస్తున్నాను. ఏదో ఒకరోజు కచ్చితంగా కలుస్తానన్న నమ్మకం ఉంది. ప్రస్తుతానికి మీ ప్రేమాభిమానాలు నాపై ఉంచండి. అప్పుడే నేను సంతోషంగా ఉంటా" అని రష్మిక ట్వీట్‌ చేసింది.

Rashmika Mandanna
రష్మిక

గతేడాది వచ్చిన 'భీష్మ', 'సరిలేరు నీకెవ్వరు' చిత్రాలతో రష్మిక దశ తిరిగింది. అదే జోరులో ఈ కన్నడ చిన్నది మరిన్ని సినిమాలకు సంతకాలు చేసింది. ఇప్పుడు బిజీ షెడ్యూల్‌తో తీరికలేకుండా సినిమాలు చేస్తోంది. ప్రస్తుతం 'పుష్ప', 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో పాటు, 'మిషన్‌ మజ్ను', 'గుడ్‌ బై' చిత్రాల్లో నటిస్తోంది. ఇటీవల బాలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు ప్లాన్‌ చేస్తోంది.

ఇదీ చూడండి: బాయ్​ఫ్రెండ్​ పక్కన ఉండగానే హీరోయిన్​కు ప్రపోజల్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.