ETV Bharat / sitara

యూట్యూబ్​ ఛానెల్​ లాంఛ్ చేసిన ఆ స్టార్​ భామ! - rashmika mission majnu movies

Rashmika Mandanna: 'ఛలో' సినిమాతో టాలీవుడ్​లోకి ఎంట్రీ ఇచ్చి అభిమానులతో పాటు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్​ రష్మిక మందన. వరుస విజయాలతో దూసుకుపోతూ క్రేజీ అవకాశాలను దక్కించుకుంటున్న ఈ భామ తాజాగా తన యుట్యూబ్​ ఛానెల్​ను ప్రారంభించింది.

రష్మిక
rashmika mandanna
author img

By

Published : Mar 11, 2022, 10:35 AM IST

Rashmika Mandanna Youtube Channel: ట్విట్టర్​, ఇన్​స్టా ద్వారా పలువురు హీరోయిన్లు తమకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటుంటారు. అయితే కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం యూట్యూబ్​ ఛానళ్ల ద్వారా ఫ్యాన్స్​కు చేరువవుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి రష్మిక చేరింది.

హీరోయిన్​గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రష్మిక గురువారం తన యూట్యూబ్ ఛానల్​ను ప్రారంభించింది. ఈ విషయాన్ని ట్విట్టర్​ వేదికగా తెలిపింది. తన యూట్యూబ్ ఛానల్​ను సబ్స్క్రైబ్ చేసుకోండి అంటూ ఓ వీడియోను కూడా ట్విట్టర్​లో పోస్ట్​ చేసింది ఈ బ్యూటీ. రష్మిక మందన ఇతర సోషల్ మీడియా హ్యండిళ్లల్లోనూ చురుగ్గా ఉంటుంది.

ఇటీవలే విడుదలైన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' చిత్రంతో విజయం అందుకున్న ఈ బ్యూటీ 'మిషన్ మజ్ను' సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. కాగా, గుడ్​బై మూవీలో అమితాబ్​తో కలిసి నటిస్తుంది.

ఇదీ చదవండి: ప్రపంచ సినీ చరిత్రలో తొలిసారి.. 'రాధేశ్యామ్​' కోసమే అలా!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.