ETV Bharat / sitara

రేటు​ పెంచేసిన రష్మిక.. 'పుష్ప-2' కోసం అన్ని కోట్లు? - pushpa samantha song

Rashmika pushpa movie: 'పుష్ప' సక్సెస్​ను ఎంజాయ్ చేస్తున్న రష్మిక.. రేటు పెంచేసింది. తన రెమ్యునరేషన్​ను ఏకంగా 50 శాతం పెంచేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

Rashmika
రష్మిక
author img

By

Published : Jan 9, 2022, 10:55 PM IST

Rashmika remuneration: 'పుష్ప'.. ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేసింది. మొన్నటివరకు థియేటర్లకు వెళ్లి సినిమా చూసిన ఆడియెన్స్.. ఇప్పుడు ఓటీటీలోనే రిపీట్​గా చూస్తున్నారు. మూవీ టీమ్​ కూడా ఈ విషయంలో ఫుల్​హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ఓ క్రేజీ న్యూస్ బయటకొచ్చింది.

'పుష్ప'లో అల్లు అర్జున్​ తన నటవిశ్వరూపం చూపిస్తే, పల్లెటూరి అమ్మాయిగా రష్మిక ఆకట్టుకునేలా కనిపించింది. అయితే రెండో పార్ట్​ కోసం రష్మిక రెమ్యునరేషన్​ పెంచేసిందని సమాచారం. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్త హాట్​ టాపిక్​గా మారింది.

Rashmika
'పుష్ప' సినిమాలో రష్మిక

'పుష్ప' కోసం రష్మిక రూ.2 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు రెండో భాగం కోసం 50 శాతం పెంచేసింది! అంటే మొత్తం రూ.3 కోట్లు డిమాండ్ చేసిందట. దానికి నిర్మాతలు కూడా ఒప్పుకొన్నారట.

'పుష్ప' పార్ట్-2 రెగ్యులర్ షూటింగ్​.. ఫిబ్రవరి నుంచి మొదలుపెడతామని డైరెక్టర్ సుకుమార్ ఇటీవల చెప్పారు. త్వరగా పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబరు 16న థియేటర్లలో సినిమా రిలీజ్ చేస్తామని అన్నారు. గతేడాది డిసెంబరు 17న 'పుష్ప'.. పాన్ ఇండియా వైడ్​గా విడుదలైంది.

శేషాచలం ఎర్రచందనం స్మగ్లింగ్ కథతో తీసిన 'పుష్ప' సినిమాలో బన్నీతో పాటు రష్మిక, సునీల్, అనసూయ, ఫహాద్ ఫాజిల్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించింది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.