ETV Bharat / sitara

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ సినిమాలో రష్మిక? - Rashmika

ఎన్టీఆర్​-త్రివిక్రమ్​ కాంబోలో రానున్న 'అయినను పోయి రావలె హస్తినకు' సినిమాలో హీరోయిన్​గా రష్మిక నటించనున్నట్లు తెలుస్తోంది. తాజాగా త్రివిక్రమ్​ను ఈ ముద్దుగుమ్మ కలవడమే ఇందుకు కారణం.

rashmika
రష్మిక
author img

By

Published : Mar 21, 2021, 10:06 PM IST

ఎన్టీఆర్​, రష్మిక కలిసి నటించనున్నారా? అంటే అవుననే తెగ చర్చించుకుంటున్నారు సినీ వర్గాలు, నెటిజన్లు. ఎందుకంటే త్రివిక్రమ్​ను ఈ భామ కలవడమే ఇందుకు కారణం. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో వైరల్​గా మారాయి. వెంటనే అభిమానులు ట్రెండింగ్​ చేయడం ప్రారంభించేశారు.

త్రివిక్రమ్​ తన కొత్త సినిమాను ఎన్టీఆర్​తో తీయనున్నారు. 'అయినను పోయి రావలె హస్తినకు' అనే టైటిల్​ను కూడా ఖరారు చేశారు. ఈ సినిమా కథ వినడం కోసమే రష్మిక.. త్రివిక్రమ్​ను కలిసిందని తెలిసింది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికార ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

ప్రస్తుతం రష్మిక.. అల్లు అర్జున్​ 'పుష్ప', 'ఆడవాళ్లు మీకు జోహార్లు', తమిళంలో 'సుల్తాన్'​ సినిమాలో నటిస్తోంది. మరోవైపు ఎన్టీఆర్​ ఆర్​ఆర్ఆర్​ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం పూర్తవ్వగానే త్రివిక్రమ్​ సినిమా సెట్స్​పైకి వెళ్తుంది.

ఇదీ చూడండి: 'పాప ఓ పాప' వచ్చేసింది- 'మిషన్​ మజ్ను' షూటింగ్​లో రష్మిక​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.