విజయ్ దేవరకొండ, రష్మిక మందణ్న కలిసి నటించిన కొత్త చిత్రం 'డియర్ కామ్రేడ్'. ఫైట్ ఫర్ వాట్ యు లవ్ అనేది ఉపశీర్షిక. ఈ సబ్టైటిల్కు తగినట్టుగానే ఇంట్లోవాళ్లతో ఫైట్ చేసిందంట రష్మిక. విజయ్‌తో ఇంకో సినిమా చేస్తానంటే వాళ్లు ఒప్పుకోనందుకే కుటుంబ సభ్యులతో గొడవపడ్డాడని చెప్పిందీ కన్నడ సుందరి. డియర్ కామ్రేడ్ ప్రీ రిలీజ్ వేడుకలో ఈ విషయం చెప్పింది.
"దర్శకుడు భరత్ కథ నాకు బాగా నచ్చింది. కచ్చితంగా సినిమా చేయాలని అనుకున్నా. కానీ విజయ్‌తో ఇంకో సినిమా ఎందుకు, చెయ్యొద్దు అంటూ కుటుంబ సభ్యులు అడ్డు చెప్పారు. ఇక్కడ ఎవరితో చేస్తున్నామన్నది విషయం కాదు.. ఈ స్ర్కిప్టు నేను చేయాలి అంతే అని చెప్పి సినిమాలో అడుగుపెట్టా" -రష్మిక మందణ్న
రష్మిక ఇంతకు ముందు విజయ్‌తో కలిసి గీతగోవిందం సినిమాలో నటించింది. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన డియర్‌కామ్రేడ్ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. నవీన్ యేర్నేని, రవిశంకర్ తదితరులు నిర్మిస్తున్నారు. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నాడు. ఈ పాటలు శ్రోతల్నీ అలరిస్తున్నాయి.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇది చదవండి: 'పోకిరి'లో కంగనాను ఊహించగలమా!