రెమో' సినిమాతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులనీ మెప్పించిన యువ దర్శకుడు బక్కియరాజ్ కణ్ణన్. ఆవారా, ఊపిరి, ఖైదీ వంటి చిత్రాలతో టాలీవుడ్‌కు దగ్గరైన నటుడు కార్తి. వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రం 'సుల్తాన్'. రష్మిక కథానాయికగా నటించింది. ఏప్రిల్ 2న తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించింది చిత్రబృందం.

ఈ వేడుకలో నటి రష్మిక హైలైట్‌గా నిలిచింది. ఎరుపు రంగు చీరతో వచ్చిన ఈ భామ తన క్యూట్ క్యూట్ హావాభావాలతో కుర్రకారు మది దోచింది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. అవి మీరూ చూసేయండి.




