హీరో రామ్, తమిళ దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్లో 'రాపో 19' వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్‌ను సంగీత దర్శకుడిగా ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రంలో హీరోయిన్గా 'ఉప్పెన' భామ కృతిశెట్టి నటిస్తోంది.
సందీప్ కిషన్, బాబీ సింహా ప్రధానపాత్రల్లో 'గల్లీ రౌడీ' సినిమా తీస్తున్నారు. దీని టీజర్‌ను ఏప్రిల్ 19న, విజయ్ దేవరకొండ విడుదల చేయనున్నారు. కోనా ఫిల్మ్ కార్పోరేషన్, ఎంవీవీ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో నేహా శెట్టి హీరోయిన్. జి.నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.
యువ హీరో అల్లు శిరీష్ నటించిన తొలి ఆల్బమ్ సాంగ్ 'విలయాటి షరాబి'.. 100 మిలియన్ వ్యూస్‌తో దూసుకెళ్తోంది. దర్శన్ రావల్, నీతి మోహన్ పాడిన ఈ గీతానికి కుమ్మార్ లిరిక్స్ అందించారు. లిజో జార్జ్-డీజే స్వరాలు సమకూర్చారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: అలరిస్తున్న 'బ్లాక్ విడో', 'ఎఫ్ 9' ట్రైలర్స్