ETV Bharat / sitara

శంకర్​ దర్శకత్వంలో రణ్​వీర్​ సింగ్​? - Ranveer Singh Shankar

ప్రముఖ దర్శకుడు శంకర్​ డైరెక్షన్​లో నటించాలని భావిస్తున్నాడు బాలీవుడ్​ హీరో రణ్​వీర్​ సింగ్​. ఇందుకోసం ఇటీవల చెన్నై వెళ్లి శంకర్​ను కూడా కలిశాడని సమాచారం.

ranveer
రణ్​వీర్​
author img

By

Published : Feb 21, 2021, 7:01 PM IST

బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​-ప్రముఖ దర్శకుడు శంకర్ ​ కలిసి సినిమా చేయనున్నారా? అవుననే మాట్లాడుకుంటున్నాయి సినీ వర్గాలు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న రణ్​వీర్​​.. ఓ పాన్​ ఇండియా సినిమాలో నటించే ఆలోచనలో ఉన్నాడు. ఇందుకోసం శంకర్​తో కలిసి పనిచేయాలని నిశ్చయించుకున్నాడట. ఈ క్రమంలోనే అతడు ఇటీవల చెన్నై వెళ్లి శంకర్​ను కలిసి ఈ విషయమై చర్చించాడని సమాచారం. ఇందుకు సుముఖత చూపిన దర్శకుడు.. రణ్​వీర్​ కోసం కథ కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.

ప్రస్తుతం శంకర్​.. కమలహాసన్​తో 'భారతీయుడు 2' సినిమా తెరకెక్కిస్తున్నారు. ఆ తర్వాత హీరో రామ్​చరణ్​తో ఓ సినిమా చేయనున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ రెండు చిత్రాలు పూర్తవ్వగానే రణ్​వీర్​తో సినిమా చేసే అవకాశముంది. కాగా, రణ్​వీర్​ ప్రస్తుతం 'సర్కస్'​ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఏడాది జూన్​ 4న '83' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఇదీ చూడండి: రణ్​వీర్​ సింగ్​ '83' విడుదల తేదీ​ ఫిక్స్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.