ETV Bharat / sitara

జ్ఞాపకాలను వెతుక్కుంటూ వచ్చాను: రణ్​వీర్​ - థియేటర్​లో రణ్​వీర్​ సింగ్

బాలీవుడ్​లో అడుగుపెట్టి గురువారంతో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​. ఈ సందర్భంగా థియేటర్​కు వెళ్లి సంబరాలను జరుపుకున్నాడు.

Ranveer Singh marks 10 years in Bollywood
జ్ఞాపకాలను వెతుక్కుంటూ వచ్చాను: రణ్​వీర్​
author img

By

Published : Dec 10, 2020, 9:02 PM IST

చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి గురువారంతో పదేళ్లు పూర్తి చేసుకున్నాడు బాలీవుడ్​ స్టార్​ హీరో రణ్​వీర్​ సింగ్​. ఈ సందర్భంగా సినిమా హాలుకు వెళ్లి సంబరాలు చేసుకున్నాడు. థియేటర్​లో వేడుకలు జరుపుకోవడం కంటే మరో మంచి మార్గం ఏదీ లేదని వెల్లడించాడు.

"సినిమాల్లో నా పదేళ్ల మైలురాయిని జ్ఞాపకం తెచ్చుకోవడానికి.. నా కలల తీరానికి తిరిగి వచ్చాను" అని థియేటర్​లో సినిమా చూస్తున్న ఫొటోను సోషల్​మీడియాలో పంచుకున్నాడు. చాలా రోజుల తర్వాత థియేటర్​లో అడుగుపెట్టడం​ అద్భుతమైన అనుభూతిని కలిగించిందని అభిప్రాయపడ్డాడు.

పదేళ్ల క్రితం అనుష్క శర్మ ప్రధానపాత్రలో నటించిన 'బ్యాండ్​ బాజా బారాత్​' చిత్రంతో రణ్​వీర్​ సింగ్ బాలీవుడ్​ అరంగేట్రం చేశాడు. ఇటీవలే.. కపిల్​దేవ్​ ప్రపంచకప్​ గెలిచిన నేపథ్యంలో తెరకెక్కిన '83' చిత్రంలో తన భార్య దీపికా పదుకొణెతో పాటు కలిసి నటించాడు. మరోవైపు అక్షయ్​ కుమార్ హీరోగా రూపొందిన 'సూర్యవంశీ' సినిమాలోనూ రణ్​వీర్​ అతిథి పాత్ర పోషించాడు. కరోనా కారణంగా ఈ చిత్రాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. రణ్​వీర్​ సింగ్​ ప్రస్తుతం రోహిత్​ శెట్టి దర్శకత్వం వహిస్తున్న 'సర్కస్​' చిత్రంలో నటిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.