ETV Bharat / sitara

బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్ కారుకు ప్రమాదం - రణ్​వీర్ సింగ్ కారు ప్రమాదం

ముంబయి బాంద్రాలో బాలీవుడ్ నటుడు రణ్​వీర్ సింగ్ కారును ఓ ద్విచక్ర వాహనం వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నటుడు సురక్షితంగా బయటపడ్డాడు.

Ranveer Singh inspects damage after bike brushes against his swanky car
రణ్​వీర్ సింగ్ కారును ఢీకొట్టిన బైక్
author img

By

Published : Oct 16, 2020, 2:59 PM IST

బాలీవుడ్ యువ హీరో రణ్​వీర్​ సింగ్​ కారు చిన్న ప్రమాదానికి గురైంది. వెనక నుంచి వచ్చిన ఓ బైక్​ అతడి కారును ఢీకొట్టింది. ముంబయి బాంద్రాలో ఈ ఘటన చోటు చేసుకుంది. రణ్​వీర్​కు మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు.

రణ్​వీర్ సింగ్

ఈ ప్రమాదం జరిగిన వెంటనే రణ్​వీర్ కారు దిగి ప్రమాద తీవ్రతను పరిశీలించాడు. కారుకు ఏమైనా నష్టం జరిగిందో లేదో అని తెలుసుకున్నాడు. కొన్ని నిమిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.

ప్రస్తుతం రణ్​వీర్ '83' అనే చిత్రం చేస్తున్నాడు. 1983లో కపిల్ సేన భారత్​కు ప్రపంచకప్​ తీసుకొచ్చిన కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కపిల్ భార్య రోమీ పాత్రలో దీపికా పదుకొణె కనిపించనుంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.