హిందీ చిత్రపరిశ్రమలో స్టార్ హీరో అయిన రణ్వీర్ సింగ్.. ఎప్పుడూ తనదైన ఫ్యాషన్ దుస్తులతో అభిమానులను ఆకట్టుకుంటాడు. సరికొత్త డిజైన్లు, రంగురంగుల దుస్తులతో కనువిందు చేస్తుంటాడు. తాజాగా వావ్ అనిపించేలా కొత్త హెయిర్‌స్టయిల్‌తో దర్శనమిచ్చాడు. తన భార్య, నటి దీపికా పదుకొనే తన లుక్ సృష్టికర్త అంటూ ప్రశంసలు కురిపించాడు.
- View this post on Instagram
Hair by: @deepikapadukone Very Mifune in ‘Yojimbo’. I like it. What do you think?
">
తన హెయిర్ స్టయిల్ చూడగానే జపాన్ నటుడు తొషిరో మిఫునేలా గుర్తొచ్చినట్లు చెప్పుకొచ్చాడు రణ్వీర్. 1961లో విడుదలైన సమురాయ్ ఫిల్మ్ యోజింబో(బాడీగార్డ్)లో హీరో కేశాలు ఇలానే ఉంటాయి కదా అని అభిమానులను ప్రశ్నించాడు. ఈ పోస్టును ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు లుక్ బాగుందని కామెంట్లు పెడుతున్నారు.
ఈ గల్లీబాయ్ త్వరలో '83', 'జయేష్‌భాయ్ జోర్దార్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దీపికా తాజాగా ప్రభాస్-నాగ్ అశ్విన్ ప్రాజెక్టులో భాగస్వామ్యమైంది.