ETV Bharat / sitara

స్వర్ణ దేవాలయ సందర్శనలో దీపిక-రణ్​వీర్ - స్వర్ణ దేవాలయం

దీపిక-రణ్​వీర్.. ప్రస్తుతం దైవ సందర్శనలో ఉన్నారు. మొదటి వివాహ వార్షికోత్సం సందర్భంగా గురవారం తిరుపతి, శుక్రవారం పంజాబ్​లోని స్వర్ణ దేవాలయాన్ని దర్శించారు.

దీపిక-రణ్​వీర్
author img

By

Published : Nov 15, 2019, 11:34 AM IST

Updated : Nov 15, 2019, 11:52 AM IST

స్వర్ణ దేవాలయ సందర్శనలో దీపిక-రణ్​వీర్

బాలీవుడ్‌ జోడీ దీపికా పదుకొణె-రణవీర్‌సింగ్‌.. స్వర్ణదేవాలయాన్ని శుక్రవారం ఉదయం సందర్శించారు. కుటుంబసభ్యులతో కలిసి ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు గురువారం తమ మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు.

ఏడేళ్లపాటు ప్రేమించుకుని, గతేడాది నవంబర్‌ 14న దీపిక-రణవీర్‌ పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం కొంక‌ణి, సింధీ సంప్రదాయాల్లో జరిగింది.

పెళ్లి తర్వాత ఈ జోడీ కలిసి నటిస్తున చిత్రం '83'. భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. కపిల్​ పాత్రలో రణ్​వీర్, అతడి భార్య రోమీ భాటియా పాత్రలో దీపిక కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్​లో ప్రేక్షకుల ముందుకు రానుంది. 'చఫాక్‌' చిత్రంలోనూ నటిస్తూ బిజీగా ఉంది దీపిక. యాసిడ్‌ బాధితురాలు లక్ష్మి అగర్వాల్‌ జీవితం ఆధారంగా రూపొందుతోంది.

ఇది చదవండి: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ జంట

********************
Thank you for using CCTV+ content.Please contact Ms. Haley HE at service@cctvplus.com or call +86 10 63960094 for any further enquiries about CCTV+ content.

Copyright 2013 CCTV. All rights reserved.
Last Updated : Nov 15, 2019, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.