భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే సాధారణ ప్రజానీకానికే కాదు... సెలబ్రిటీలకు ఉద్వేగమే. ఆదివారం దాయాది జట్టుతో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్ సందర్భంగా మైదానంలో సందడి చేశారు బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్. మాంచెస్టర్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా మాజీ ఆటగాడు సునీల్ గావస్కర్‌తో కలిసి మైదానంలో స్టెప్పులేశారు. మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతుండగా బదాన్ పే సితారే అనే హిందీ పాటకు కాలు కదిపారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం విపరీతంగా వైరల్ అవుతోంది.
వ్యాఖ్యాతగానూ...
మ్యాచ్ సందర్భంగా గావస్కర్‌తో కలిసి కాసేపు కామెంటేటర్‌గానూ వ్యవహరించారు రణ్వీర్. చక్కగా చేశావని రణ్వీర్ను గావస్కర్ మెచ్చుకోవడం విశేషం.
కపిల్‌దేవ్ జీవితం ఆధారంగా ‘83’ అనే చిత్రం... రణ్వీర్ కథానాయకుడిగా తెరకెక్కుతోంది. ఈ నేపథ్యంలో క్రికెట్ మీద రణ్వీర్ పట్టు పెంచుకుంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: టాప్ 5లో బంగ్లాదేశ్... విండీస్‌పై 7 వికెట్లతో విజయం