బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ను.. సహనటుడు జతిన్ సర్నా ముద్దుపెట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. నెటిజన్లను నవ్విస్తోంది. '83' సినిమా ప్రచారంలో ఉన్న వీరు.. బస్సులో ప్రయాణిస్తుండగా ఈ సంఘటన జరిగింది.
ఈ వీడియోలో జతిన్.. రణ్వీర్కు ఎదురుగా నిల్చొని కొన్ని సెకన్లపాటు ముద్దు పెట్టుకుంటాడు. ఈ వీడియోను దీపికా ప్రత్యక్షంగా చూస్తోందని రణ్వీర్ అనడంతో, అక్కడున్న వారందరూ నవ్వుతారు.
'83' చిత్రంలో రణ్వీర్.. కపిల్ దేవ్ పాత్ర పోషిస్తున్నాడు. జతిన్ సార్నా మాజీ క్రికెటర్ యశ్పాల్ శర్మా పాత్రలో నటిస్తున్నాడు. దీపికా పదుకొణె కపిల్ భార్య రోమిగా కనిపించనుంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.
- — Jiya Chulet (@ChuletJiya) January 30, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
— Jiya Chulet (@ChuletJiya) January 30, 2020
">— Jiya Chulet (@ChuletJiya) January 30, 2020
ఇదీ చదవండి: రాకుమారిలా మారిన హీరోయిన్ శ్రద్ధాకపూర్!