యువహీరో నితిన్, కీర్తి సురేశ్ తొలిసారి కలిసి నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. ఈ సినిమా షూటింగ్ కొద్ది విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. నితిన్తోపాటు ఇతర ప్రధాన తారాగణంపై హైదరాబాద్లో కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చిత్రీకరణ జరుపుతున్నారు. 'రంగ్ దే' లో పలు సన్నివేశాలతోపాటు పాటలను పూర్తి చేయాల్సి ఉంది. వచ్చే ఏడాది సంక్రాతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.