బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్-ఆలియా భట్.. ఈ ఏడాదిని శుభవార్తతో వీడ్కోలు పలికేందుకు సిద్ధమవుతున్నారు. వీరి నిశ్చితార్థం రాజస్థాన్‌లో బుధవారం లేదా గురువారం జరగనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే కపూర్, భట్ కుటుంబ సభ్యులతో పాటు రణ్వీర్-దీపిక కూడా రాజస్థాన్‌లోని రణ్తంబోరే చేరుకోవడం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. ప్రస్తుతం వీరిందరూ ఆ ఊరిలోనే ఓ విలాసవంతమైన హోటల్లో బస్ చేస్తున్నారని, అందులోనే రణ్‌బీర్-ఆలియా ఎంగేజ్మెంట్ వేడుక జరగనుందని తెలుస్తోంది.
ఇందుకు తగ్గట్లుగానే రణ్‌బీర్ తల్లి నీతూ కపూర్.. తన కుమారుడితో పాటు రణ్వీర్ సింగ్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టా స్టోరీలో పెట్టారు. దీంతో రణ్‌బీర్-ఆలియా నిశ్చితార్థం జరగడం కచ్చితమని అభిమానులు ఫిక్సయిపోయారు.
ఈ మధ్యే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన రణ్‌బీర్ కపూర్.. త్వరలో జీవితంలో మరో అడుగు వేస్తానని చెప్పాడు. ప్రస్తుతం రణ్‌బీర్, ఆలియాతో 'బ్రహ్మస్త్ర' సినిమా చేస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో అది విడుదలయ్యే అవకాశముంది.