బాలీవుడ్ లవ్‌బర్డ్స్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ కలిసి సరదాగా గడిపేందుకు గోవాకు బయలుదేరారు. కొత్త సంవత్సర వేడుకల్ని కూడా అక్కడే జరుపుకొంటారని తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం వీరిద్దరు ముంబయి విమానాశ్రయంలో కనువిందు చేశారు. స్టైలిష్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు.
లాక్డౌన్ తర్వాత చిత్రీకరణలు పునఃప్రారంభమవ్వగానే రణ్‌బీర్-ఆలియా.. తమ తమ సినిమాలతో బిజీ అయిపోయారు. ఓ వైపు ఆలియా 'గంగూబాయ్', 'ఆర్ఆర్ఆర్', 'బ్రహ్మస్త్ర' ఇలా వరుస సినిమాల షూటింగ్లలో పాల్గొనగా.. చాక్లెట్ బాయ్ కూడా 'బ్రహ్మస్త్ర', 'లవ్ రంజన్'(ఇటీవల ప్రకటించారు) చిత్రాల కోసం తీరిక లేకుండా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే వృతిపరమైన జీవితానికి కాస్త విరామం ఇచ్చి ఉల్లాసంగా గడపడానికి ఈ ప్రేమజంట గోవాకు పయనమైంది.
ఇదీ చూడండి : బాలీవుడ్ లవర్‌బాయ్.. రణ్‌బీర్ కపూర్