'అర్జున్‌రెడ్డి' సినిమాతో చిత్రసీమలో గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ వంగా. అనంతరం ఈ చిత్రాన్ని హిందీలో 'కబీర్‌సింగ్'గా తెరకెక్కించి బాలీవుడ్ దృష్టినీ ఆకర్షించాడు. ఇందులో షాహిద్ కపూర్ హీరోగా నటించాడు. ఈ సినిమా చూసిన రణ్‌బీర్ కపూర్ సందీప్ దర్శకత్వంలో పనిచేయడానికి ఇష్టపడుతున్నాడట.
ఇప్పటికే రణ్‌బీర్.. సందీప్‌ను సంప్రదించి మంచి కథను తయారుచేయమని కోరినట్లు బాలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రముఖ నిర్మాత మురాద్ ఖేతాని-రణ్‌బీర్‌లకు సందీప్ కథను వినిపించాడట. గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టును కూడా సిద్ధం చేశాడట.
రణబీర్ ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో తన ప్రేయసి ఆలియా భట్ కథానాయికగా కనిపించనుంది. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు.