సినీ నటుడు రానా దగ్గుబాటి వివాహం ఘనంగా జరిగింది. వధువు మిహీకా బజాజ్ మెడలో మూడుముళ్లు వేసి తన జీవితంలోకి ఆహ్వానించాడు. రామానాయుడు స్టూడియోలో కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ఈ వివాహ వేడుకను నిర్వహించారు. కుటుంబసభ్యులు, కొద్ది మంది సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు.
![రానా దంపతులతో చరణ్ దంపతులు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8347987_rana-2.jpg)
మే నెలలో రానా తన ప్రేమ సంగతి బయటపెట్టాడు. మిహీకా బజాజ్ తన ప్రేమకు ఓకే చెప్పిందంటూ సోషల్‌మీడియా ద్వారా వెల్లడించాడు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు మాట్లాడుకొని పెళ్లికి అంగీకరించాయి. దీంతో శనివారం రాత్రి సుమూహుర్త సమయంలో రానా-మిహీక ఒక్కటయ్యారు.
![పెళ్లి దృశ్యం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8347987_rana-1.jpg)
![వెంకటేశ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8347987_rana-3.jpg)
![నాగచైతన్య](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/8347987_rana-4.jpg)