ETV Bharat / sitara

పవన్​తో మల్టీస్టారర్​పై రానా స్పష్టత - రానా పవన్​ కల్యాణ్​ సినిమా

పవన్​కల్యాణ్​ కొత్త సినిమాలోని ఓ పాత్ర చేస్తున్నాననే వార్తలపై హీరో రానా మాట్లాడారు. ఆ విషయం ఇంకా ఫైనల్​ కాలేదని స్పష్టతనిచ్చారు.

Pawan
పవన్​
author img

By

Published : Nov 9, 2020, 2:31 PM IST

Updated : Nov 9, 2020, 3:31 PM IST

పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ఓ కొత్త సినిమాను ఇటీవల ప్రకటించారు. ఇందులోని ఓ కీలకపాత్రలో రానా నటించనున్నారంటూ గత కొన్నిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆ వార్తలపై హీరో రానా స్పందించారు.

'నిజమే.. పవన్‌ సినిమాలోని ఓ పాత్ర కోసం చిత్రబృందం నన్ను సంప్రదించింది. అయితే అది ఇంకా ఫైనల్‌ కాలేదు. నిజం చెప్పాలంటే ఆ పాత్ర చేయడం నాక్కూడా ఎంతో ఇష్టం' అని రానా వెల్లడించారు.

మలయాళంలో విజయం సాధించిన 'అయ్యప్పన్‌ కొషియమ్' రీమేక్‌గా ఈ సినిమా రానున్నట్లు తెలుస్తోంది. అందులో బిజు మేనన్‌ పోషించిన పాత్రలో పవన్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ పోషించిన పాత్రలో రానా కనిపించనున్నారని సమాచారం.

మరోవైపు తన బాబాయ్‌ వెంకటేశ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తున్నానని రానా అధికారికంగా ప్రకటించారు. బాబాయ్‌తో కలిసి ఓ సినిమా కోసం పనిచేస్తున్నాను. ఇప్పటికే మా కథను ఫైనల్‌ చేశాం. వచ్చే ఏడాది మా సినిమా గురించి అధికారికంగా ప్రకటిస్తాం. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా' అని తెలిపారు.

ఇదీ చూడండి : బాబాయ్-అబ్బాయ్​ కాంబోలో సినిమా

Last Updated : Nov 9, 2020, 3:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.