'బాహుబలి' సిరీస్‌తో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నటుడు రానా. ప్రస్తుతం పలు సినిమాల్లో హీరోగా నటిస్తూ బిజీగా ఉన్నాడు. అందులోని 'హాథీ మేరే సాథీ'.. పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతోంది. దీనిని తెలుగులో 'అరణ్య' పేరుతో తీసుకురానున్నాడు. ఈ రోజు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఇందులో రానా రౌద్రంగా కనిపిస్తూ అలరిస్తున్నాడు.
వన్యప్రాణుల కోసం
స్వార్థం కోసం మానవులు.. అడవులను ఆక్రమించడం, సహజ వనరులను నాశనం చేయడం వల్ల వన్యప్రాణులు మనుగడకు ముప్పు వాటిల్లుతోంది. ఈ కథతోనే రూపొందుతుందీ చిత్రం. మనిషి చేసే చర్యల వల్ల ఏనుగుల మనుగడ కోల్పోయే పరిస్థితి వస్తే, ఆ మూగ జీవాల కోసం నిలబడి, ఈ సమస్యను ధైర్యంగా ఎదిరించిన వ్యక్తి కథే ఈ 'అరణ్య'.
ప్రభు సాల్మన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుంది. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియ పిలగోన్కర్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో వేసవి కానుకగా ఏప్రిల్ 2న రానుందీ సినిమా.
ఇదీ చదవండి: కేరళ అడవుల్లో రానాతో సాయిపల్లవి