ETV Bharat / sitara

మరో అడ్వెంచర్​ మూవీలో నటించనున్న రానా! - రానా న్యూస్​

టాలీవుడ్​ నటుడు రానా దగ్గుబాటి ప్రధానపాత్రలో ఓ చిత్రం తెరకెక్కనుంది. నేచురల్​ యాక్షన్​ అడ్వెంచర్​ కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారట. దీనికి సురేశ్​ ప్రొడక్షన్​ సంస్థ నిర్మాణ బాధ్యతలు చేపట్టనుందని సమాచారం.

Rana Daggubati to team up with Milind Rau for his next?
మరో అడ్వెంచర్​ మూవీలో నటించనున్న రానా!
author img

By

Published : Sep 1, 2020, 9:10 AM IST

వైవిధ్యభరిత కథా చిత్రాల్ని ప్రేక్షకులకు చూపించేందుకు ఎప్పుడూ ఉత్సాహం చూపిస్తుంటారు నటుడు రానా. ఈ క్రమంలోనే ఇప్పుడాయన మరో కొత్త కథకు పచ్చజెండా ఊపారు. 'గృహం' చిత్రంతో సినీప్రియుల్ని మెప్పించిన మిళింద్‌ రావ్‌ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనుందట. ఈ చిత్రాన్ని ఆచంట గోపీనాథ్‌తో కలిసి సురేశ్​ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించబోతుంది.

ఓ సరికొత్త సూపర్‌ నేచురల్‌ యాక్షన్‌ అడ్వంచర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందించనున్నారని సమాచారం. ఈ సినిమాలో గ్రాఫిక్స్​కు‌ ఎంతో ప్రాధాన్యత ఉంటుందని, అందుకే దీని కోసం భారీ బడ్జెట్‌ను కేటాయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే మరిన్ని వివరాలు ప్రకటించనున్నారు. ప్రస్తుతం రానా కథానాయకుడిగా నటిస్తోన్న 'విరాటపర్వం' తుది దశ చిత్రీకరణలో ఉండగా.. ఇప్పటికే పూర్తయిన 'అరణ్య' విడుదలకు సిద్ధంగా ఉంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.