ఇన్నాళ్లుగా టాలీవుడ్లో ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఉన్న హీరోల్లో రానా ఒకరు. ఇటీవల "ఆమె నా ప్రేమను అంగీకరించింది" అంటూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. మే 21న ప్రేయసి మిహీకా బజాజ్‌తో కలిసి నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు. అయితే తాజాగా వీరి పెళ్లికి కూడా ముహూర్తం కుదిరినట్లు టాక్.
హైదరాబాద్‌లోనే ఆగస్టు 8న రానా, మిహీకా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితుల దృష్ట్యా తమ పెళ్లిని నిరాడంబరంగా చేసుకోవాలనుకుంటున్నట్లు సమాచారం. పెళ్లి వేదిక ఎక్కడనేది స్పష్టత లేదు. ఈ వేడుకకు తమ ఇరు కుటుంబాల్లోని అత్యంత సన్నిహితులను మాత్రమే ఆహ్వానించనున్నారట.
ఇటీవల రానా తండ్రి నిర్మాత సురేశ్ బాబు.. ఈ ఏడాది ఆఖరు నాటికి పెళ్లి వేడుకలను పూర్తి చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
-
And it’s official!! 💥💥💥💥 pic.twitter.com/0J3jBeEaep
— Rana Daggubati (@RanaDaggubati) May 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">And it’s official!! 💥💥💥💥 pic.twitter.com/0J3jBeEaep
— Rana Daggubati (@RanaDaggubati) May 21, 2020And it’s official!! 💥💥💥💥 pic.twitter.com/0J3jBeEaep
— Rana Daggubati (@RanaDaggubati) May 21, 2020
ఇదీ చూడండి : నిరాడంబరంగా రానా, మిహీకాల నిశ్చితార్థం