ETV Bharat / sitara

అనారోగ్యంపై రానా స్పందన.. చెబుతూ కంటతడి - rana latest news

'సామ్ జామ్' కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు రానా.. తన ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడారు. ఆ విషయాన్ని చెబుతూ కంటతడి పెట్టారు.

rana about his helath condition in samjam show
అనారోగ్యంపై రానా స్పందన.. చెబుతూ కంటతడి
author img

By

Published : Nov 23, 2020, 10:18 AM IST

గతకొంతకాలంగా నటుడు రానా ఆరోగ్యంపై రకరకాల వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. ఆయనకు కిడ్నీ సమస్య ఉందని, అందుకోసం ఆయన విదేశాల్లో చికిత్స కూడా తీసుకుంటున్నారని ఎన్నో రకాల చర్చలు వచ్చాయి. అయితే.. వీటిపై రానా ఎన్నడూ స్పందించలేదు. కొంతకాలం తర్వాత ఆయన 'అరణ్య' ఫస్ట్‌లుక్‌ విడుదల చేయడం వల్ల.. ఈ సినిమా కోసం రానా తన బరువు తగ్గించుకున్నాడేమో అనుకున్నారంతా. కానీ.. ఈ భల్లాలదేవుడు తాజాగా ఓ చేదు వార్త చెప్పారు. సమంత హోస్ట్‌గా వ్యవహరించే 'సామ్‌జామ్‌' కార్యక్రమంలో పాల్గొన్న రానా.. తన ఆరోగ్యంపై ఇలా స్పందించారు.

rana nag ashwin samanatha
సామ్​జామ్ షోలో సమంతతో రానా, నాగ్ అశ్విన్

జీవితం వేగంగా ముందుకు వెళుతున్న సమయంలో అకస్మాత్తుగా ఒక చిన్న పాజ్ బటన్ వచ్చిందని, పుట్టినప్పటి నుంచి తనకు బీపీ ఉందని, దీని వల్ల గుండెకు సమస్య తలెత్తుతుందని రానా అన్నారు. "నీ కిడ్నీలు కూడా పాడవుతాయి. స్ట్రోక్ హెమరేజ్‌కు(మెదడులో నరాలు చిట్లిపోవడం) 70 శాతం, మరణానికి 30 శాతం అవకాశం ఉంది" అని వైద్యులు చెప్పారని రానా తెలిపారు. ఈ విషయం చెప్పే క్రమంలో రానా కంటతడి పెట్టుకున్నారు. వెంటనే సమంత స్పందిస్తూ 'మీ చుట్టు జనాలు రకరకాలుగా మాట్లాడుకున్నా మీరు మాత్రం ఎంతో ధైర్యంగా ఉన్నారు. ఆ సమయంలో నేను మిమ్మల్ని స్వయంగా చూశాను. మీరు నిజంగా సూపర్‌ హీరో' అని చెప్పింది. ఈ కార్యక్రమంలో రానాతో పాటు డైరెక్టర్‌ నాగ్‌అశ్విన్‌ కూడా పాల్గొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.