ETV Bharat / sitara

'కేజీఎఫ్‌ 2' టీజర్​పై ఆర్జీవీ స్పందన.. ఏమన్నారంటే? - 'కేజీఎఫ్‌ 2' టీజర్​పై ఆర్జీవీ స్పందన

రాకింగ్​ స్టార్ యశ్​​ నటించిన 'కేజీఎఫ్​ 2' టీజర్​కు వస్తోన్న రెస్పాన్స్​పై ప్రముఖ దర్శకుడు రామ్​గోపాల్​ వర్మ మాట్లాడారు. ఈ సినిమాతో చిత్రదర్శకుడు ప్రసాంత్​నీల్​, హీరో యశ్.. కన్నడ చిత్రపరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చారని ప్రశంసించారు.

ram
రామ్​
author img

By

Published : Jan 16, 2021, 6:35 AM IST

బ్లాక్‌బస్టర్‌ విజయాన్ని సొంతం చేసుకున్న 'కేజీయఫ్‌' చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కుతున్న 'కేజీయఫ్‌-2' చిత్రబృందంపై ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. ఇటీవల విడుదలైన కేజీయఫ్‌-2 టీజర్‌కు వస్తోన్న రెస్పాన్స్‌ పట్ల ఆర్జీవీ స్పందించారు. రెండేళ్ల క్రితం బాలీవుడ్‌ మాత్రమే కాకుండా దక్షిణాది చిత్రపరిశ్రమ కూడా కన్నడ ఇండస్ట్రీని సరిగ్గా గుర్తించలేదని.. కానీ కేజీయఫ్‌-2తో ప్రశాంత్‌నీల్‌, యశ్‌ ప్రస్తుతం ఆ పరిశ్రమకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకువచ్చారని ఆర్జీవీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాగా, తెలుగు చిత్రపరిశ్రమలో తెరకెక్కిన పలు భారీ బడ్జెట్‌ చిత్రాలతో పోల్చుతూ కేజీయఫ్‌2పై వర్మ‌ పొగడ్తల వర్షం కురిపించారు. భారీ బడ్జెట్‌ చిత్రాల టీజర్లు కోట్లలో వ్యూస్‌ సాధించడానికి కొన్ని నెలల సమయం పట్టిందని.. కానీ కేజీయఫ్‌-2 టీజర్‌ మూడు రోజుల్లోనే 14 కోట్ల వ్యూస్‌ సొంతం చేసుకుందన్నారు. దీంతో మిగిలిన అన్ని చిత్రపరిశ్రమలకు ప్రశాంత్‌నీల్‌ గట్టి పంచ్‌ ఇచ్చినట్లు అయ్యిందని వర్మ తెలిపారు.

ఇదీ చూడండి : ఆర్జీవీకి తొలి అవకాశం ఎలా వచ్చింది!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.