ETV Bharat / sitara

రమేశ్​బాబు భౌతికకాయానికి ప్రముఖుల నివాళులు.. కన్నీటిపర్యంతమైన కృష్ణ - superstar krishna

Ramesh babu death: అనారోగ్యంతో మరణించిన సూపర్​స్టార్ కృష్ణ తనయుడు రమేశ్​బాబు భౌతిక కాయానికి. ఆయన కుటుంబసభ్యులతో పాటు పలువురు నటులు హాజరై నివాళులర్పించారు.

ramesh babu last rites
రమేశ్​బాబు అంత్యక్రియలు
author img

By

Published : Jan 9, 2022, 12:38 PM IST

Updated : Jan 9, 2022, 12:55 PM IST

Ramesh babu last rites: అనారోగ్యం కారణంగా సూపర్​స్టార్ కృష్ణ తనయుడు, మహేశ్ బాబు సోదరుడు ఘట్టమనేని రమేశ్​బాబు తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం హైదరాబాద్​లోని పద్మాలయా స్టూడియోలో ఆయన భౌతిక కాయానికి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. కృష్ణ, ఆయన సతీమణి కన్నీటి పర్యంతమయ్యారు.

రమేశ్​బాబు భౌతిక కాయం వద్ద ఆయన సతీమణి, కుమార్తె, తండ్రి కృష్ణ

నటుడు నరేశ్, గల్లా జయదేవ్, 'మా' అధ్యక్షుడు మంచు విష్ణుతో పాటు పలువురు సినీ నటులు భౌతిక కాయానికి నివాళులర్పించారు. మహేశ్ బాబు కరోనాతో ప్రస్తుతం క్వారంటైన్​లో ఉండటం వల్ల అంత్యక్రియలకు రాలేకపోయారు.

ప్రముఖుల నివాళులు

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రమేశ్​బాబు.. శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. అల్లూరి సీతారామరాజు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన ఈయన.. దాదాపు 15 సినిమాల్లో హీరోగా, ఇతర పాత్రల్లో నటించారు. మహేశ్​బాబు అతిథి, అర్జున్​ సినిమాలను నిర్మించారు.

ఇవీ చదవండి:

Last Updated : Jan 9, 2022, 12:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.